తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Minister Mallareddy : కేసీఆర్ తోడుంటే నాకెందకు భయమన్న మల్లారెడ్డి

Minister Mallareddy : కేసీఆర్ తోడుంటే నాకెందకు భయమన్న మల్లారెడ్డి

HT Telugu Desk HT Telugu

28 November 2022, 8:30 IST

  • Minister Mallareddy ముఖ్యమంత్రి కేసీఆర్‌ తోడుంటే తనకు భయమెందుకు టిఆర్‌ఎస్‌ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఐటీ రెయిడ్స్‌ తనను భయపెట్టలేవని, కేసీఆర్ తన వెంట ఉండగా ఇలాంటి దాడులు తనను బయపెట్టలేవని మల్లారెడ్డి చెప్పారు.2024 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు.

మంత్రి మల్లారెడ్డి
మంత్రి మల్లారెడ్డి

మంత్రి మల్లారెడ్డి

Minister Mallareddy కేసీఆర్‌ తన వెంట ఉండగా ఐటీ దాడులకు భయపడే ప్రసక్తి లేదని తెలంగాణ రాష్ట్రీయ సమితి నాయకుడు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి చెపపారు. ఆదాయపు పన్ను శాఖ దాడులపై స్పందించిన మల్లారెడ్డి సీఎం కేసీఆర్ తన వెంట ఉన్నందున దాడులకు భయపడేది లేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Karimnagar News : రైతులకు నష్టం జరగనివ్వం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం- పౌరసరఫరాల శాఖ కమిషనర్

Wines Shops Close : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, మూడ్రోజుల పాటు వైన్ షాపులు బంద్

TS Inter Admissions 2024-25 :తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల, రేపట్నుంచి అప్లికేషన్లు జారీ

Tirumala Tour : ఒకే ఒక్క రోజులో తిరుమల ట్రిప్, ఫ్రీగా శ్రీవారి శీఘ్రదర్శనం - తెలంగాణ టూరిజం నుంచి అదిరిపోయే ప్యాకేజీ

మెదక్ జిల్లా ములుగు మండలం బహిలంపూర్‌లో వాటర్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 500-600 మంది పోలీసులు, సిఆర్‌పిఎఫ్ సిబ్బందితో కేంద్ర సంస్థలు తనను అణచివేయగలవని, తనపై దాడులు చేయవచ్చని, అయితే ముఖ్యమంత్రి కె సి రావు తన వెంట ఉన్నంత వరకు తాను భయపడబోనని చెప్పారు.

మల్లా రెడ్డి ఆదాయపు పన్ను శాఖ తనపై కక్ష పూరితంగా వ్యవహరించిందని మల్లారెడ్డి ఆరోపించారు. “తాను ఎటువంటి పత్రాలను చించలేదని, ఎవరి ల్యాప్‌టాప్‌ను లాక్కోలేదన్నారు.”

మరోవైపు డ్యూటీలో ఉన్న ఆదాయపు పన్ను అధికారిని వేధించారనే ఆరోపణలపై మంత్రిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 353 మరియు 506 కింద బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఐటి శాఖ దాడుల్లో "100-కోట్ల నల్లధనం" ఉన్నట్లు పేర్కొన్న పత్రంపై తన కుమారుడి నుంచి బలవంతంగా సంతకాలు తీసుకున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. మంత్రి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి చేత అధికారిక పత్రాలపై ఐటీ శాఖ అధికారులు సంతకాలు చేయించుకున్న ఘటనపై మంత్రి వివరణ ఇచ్చారు. ‘నా పెద్ద కొడుకు ఆస్పత్రిలో ఉన్నాడని, అతని దగ్గర సంతకాలు తీసుకోవద్దని, తాను సంతకాలు చేయనని చెప్పడంతో తమ చిన్న కొడుకు, భద్రారెడ్డితో ఐటీ అధికారి సంతకం చేయిస్తున్నారని అకస్మాత్తుగా తెలిసిందన్నారు".

"తాను ఆసుపత్రికి వెళ్లేసరికి వారు వెళ్లిపోయారని ఎందుకు అంత హడావిడి పడ్డారని మంత్రి ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో మంత్రి బలవంతంగా ల్యాప్‌టాప్మ తీసుకోవడం, మొబైల్ ఫోన్, సాక్ష్యాలను లాక్కున్నారని ఆదాయపన్ను శాఖ అధికారి రత్నాకర్ పెట్టిన కేసును ప్రస్తావిస్తూ, “ అధికారులతో చాలా మర్యాదగా ప్రవర్తించానని, ల్యాప్‌టాప్‌ను ఐటీ అధికారి తన ఇంట్లో వదిలిపెట్టాడని, దాన్ని తిరిగి పోలీస్ స్టేషన్‌‌లో ఇవ్వడం తప్ప తానేం తప్పు చేయలేదన్నారు?"

తనపై ఐటీ దాడులు జరగడం ఇదే తొలిసారి కాదని, వాళ్లు తమ పని తాము చేసుకుంటున్నారు, మేము మా పని చేస్తున్నామని ఇంత పెద్ద ఎత్తున దాడులు జరగడం నేనెప్పుడూ చూడలేదన్నారు . తాను స్మగ్లింగ్‌ చేస్తున్నానా, హవాలా వ్యాపారంలో పాలుపంచుకున్నానా? క్యాసినో నడుపుతున్నానా? అని మంత్రి ప్రశ్నించారు. "తాను విద్యాసంస్థలను మాత్రమే నడుపుతున్నాను" అని మంత్రి మరింత స్పష్టం చేశారు.

.కేంద్ర ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోందని మంత్రి ఆరోపించారు. ‘‘నేను టీఆర్‌ఎస్‌ మంత్రిని కావడమే ఐటీ దాడుల వెనుక ఉన్న కారణం అని చెప్పారు. అందరినీ టార్గెట్‌ చేస్తున్నారని రైడ్‌ చేయాలంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు 19 ఉన్నాయని అక్కడ ఎందుకు చేయట్లేదన్నారు. కరెంటు, పింఛన్లు, నీళ్లు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మంత్రి ఆరోపించారు.

"తెలంగాణ మోడల్‌ను కొనసాగిస్తూ, భారత రాష్ట్ర సమితి 2024 లోక్‌సభ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకుంటుందని చెప్పారు. మాపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ దాడులు జరుగుతున్నాయని తెలంగాణ మంత్రి ఆరోపించారు.