తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Munugode By Election : మునుగోడు బైపోల్.. ఎల్బీనగర్, ముంబయితో లింకేంటి?

Munugode By Election : మునుగోడు బైపోల్.. ఎల్బీనగర్, ముంబయితో లింకేంటి?

Anand Sai HT Telugu

25 October 2022, 19:40 IST

google News
    • Munugode By Election : మునుగోడు ఉపఎన్నిక సమయం దగ్గర పడుతోంది. పార్టీలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నాయి. తమకే ఓటు వేయాలంటూ.. విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నిక మధ్యలో ఎల్బీనగర్, ముంబయి కూడా వస్తుంది. ఇంతకీ ఎక్కడో ఉన్న వాటితో మునుగోడుకు లింకు ఏంటి?
మునుగోడుఉప ఎన్నిక
మునుగోడుఉప ఎన్నిక

మునుగోడుఉప ఎన్నిక

ఎల్బీనగర్(LB Nagar)లో ప్రధాన పార్టీల నేతలు అడ్డా వేశారు. మరోవైపు ఓ కీలక నేత ముంబయి వెళ్లినట్టుగా సమాచారం. మునుగోడు ఉపఎన్నిక ఓ వైపు జరుగుతుంటే.. పార్టీల నేతలు వేరే ప్రాంతంలో ఏం చేస్తున్నారు. ఇంతకీ ఆ పట్టణాల్లో నేతలకు పని ఏం ఉంది? ఈ నగరాలతో మునుగోడుకు లింకేంటి?

మునుగోడు ఉప పోరు(Munugode Bypoll)లో ఏ అవకాశాన్ని వదులుకోవద్దని పార్టీలు అనుకుంటున్నాయి. ఒక్కో ఓటు ఎంతో విలువైనదిగా భావిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మునుగోడు నుంచి పనుల కోసం బయటకు వెళ్లిన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరినీ వదలకుండా పార్టీల నేతలు ఫోన్లు చేసి ప్రేమగా మాట్లాడుతున్నారు. మా పార్టీకే ఓటు వేయాలంటూ.. విజ్ఞప్తి చేస్తున్నారు.

మునుగోడు(Munugode) నియోజకవర్గంలోని చాలామంది జీవనోపాధి కోసం హైదరాబాద్ లో ఉంటారు. ఇందులో ఎక్కువమంది ఎల్బీనగర్ దగ్గరలో ఉంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునేవారు ఉన్నారు. దీంతో ఎల్బీనగర్ కేంద్రంగా ప్రధాన పార్టీల నేతలు రాజకీయాలు చేస్తున్నారు. మునుగోడు లోకల్ నేతలు(Munugode Local Leaders).. మునుగోడు ఓటర్ల జాబితా పట్టుకుని.. ఎల్బీనగర్ ప్రాంతంలో ఉండే ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. 10 వేలకు పైగా ఓటర్లు ఉంటారని తెలుస్తోంది. దీంతో సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాయి పార్టీలు.

అయితే ఈ విధానం ఓన్లీ ఎల్బీ నగర్ కే పరిమితం కాలేదు. ఇతర రాష్ట్రాలకు వెళ్తోంది. ముంబయి(Mumbai), ఇతర ప్రాంతాల్లో నివసించే.. వారికి ఫోన్లు చేస్తున్నారు. దీంతో ప్రచారం ఇతర రాష్ట్రాలకు పాకింది. ఓ కీలక నేత ముంబయికి వెళ్లినట్టుగా చెబుతున్నారు. రావడానికి, వెళ్లడానికి అంతా ఖర్చు భరిస్తామని.. తమకే ఓటు వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఇక ఇప్పటికే బీజేపీ(BJP), టీఆర్ఎస్(TRS) పార్టీలు ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాయి. ఎలాగైనా తమనే గెలిపించాలని ఆత్మీయ సమ్మేళనాల్లో చెబుతున్నాయి. ఎక్కడ మునుగోడు ప్రజలు ఉంటే.. అక్కడ నేతలు వాలిపోతున్నారు. ఏ ఒక్క ఓటరును వదలకుండా కలుస్తున్నారు. మరోవైపు మునుగోడు ప్రభుత్వ ఉద్యోగులపైనా పార్టీలు కన్నేశాయి. ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమవుతున్నాయి.

తదుపరి వ్యాసం