Rajasekhar | మోసాలు కప్పిపుచ్చుకోవడానికే పార్టీలు మారుస్తున్నారు...రాజశేఖర్ జీవితపై నిర్మాత ఆరోపణలు-garudavega producer allegations on hero rajasekhar and jeevitha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajasekhar | మోసాలు కప్పిపుచ్చుకోవడానికే పార్టీలు మారుస్తున్నారు...రాజశేఖర్ జీవితపై నిర్మాత ఆరోపణలు

Rajasekhar | మోసాలు కప్పిపుచ్చుకోవడానికే పార్టీలు మారుస్తున్నారు...రాజశేఖర్ జీవితపై నిర్మాత ఆరోపణలు

HT Telugu Desk HT Telugu
Apr 22, 2022 07:15 PM IST

హీరో రాజశేఖర్ ను జైలుకు వెళ్లడం ఖాయమని అంటున్నారు పి.ఎస్.వి గరుడవేగ నిర్మాత కోటేశ్వరరాజు. రాజశేఖర్ తమను ఇరవై ఆరు కోట్ల మేర మోసం చేశాడని ఆయన ఆరోపించారు.

<p>జీవిత, రాజశేఖర్</p>
జీవిత, రాజశేఖర్ (twitter)

 హీరో రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత తమను మోసం చేశారంటూ పి.ఎస్.వి గరుడవేగ నిర్మాత కోటేశ్వరరాజు మీడియా ముందుకొచ్చారు. తాము చేస్తున్న మోసాలను కప్పిపుచ్చుకోవడానికే రాజశేఖర్, జీవిత పార్టీలు మారుస్తున్నారని, ప్రజలకు సేవ చేయడానికి కాదని ఆయన ఆరోపించారు. కోటేశ్వరరాజు మాట్లాడుతూ రాజశేఖర్ తో సినిమాలు తీసేవాళ్లు ఎవరూ లేకపోవడంతో ఆయన డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని రాజశేఖర్ తండ్రి మాతో అన్నారని, రాజశేఖర్ తో సినిమా చేస్తే బాగుంటుందని అతడి తండ్రి కోరడంతోనే గరుడవేగ డబ్బులివ్వడానికి ఒప్పుకున్నామని కోటేశ్వరరాజు చెప్పారు ‘రాజశేఖర్ ఆస్తులను తాకట్టు పెట్టుకొని 26 కోట్లు ఇస్తే వారు మమ్మల్ని  నట్టేట ముంచారు. ఆ ప్రాపర్టీస్ ను మాకు తెలియకుండా బీరం సుధాకర్ రెడ్డికి అమ్మారు. తనఖా పెట్టిన ప్రాపర్టీస్ అమ్మకూడదనేది అందరికి తెలుసు.  దీనిపై తిరవళ్లూరు ఎస్.పి. ఆఫీస్ లో రాజశేఖర్ పై కేసు పెట్టాం. త్వరలో రాజశేఖర్ తప్పకుండా జైలుకు వెళతాడు. అన్ని ఆధారాలతో అతడికి జైలుకు పంపించడం మీరు చూస్తారు’ అని కోటేశ్వరరాజు తెలిపారు. 

ఒకరితో సినిమా తీసి మరొకరికి అమ్మడం వారికి వెన్నతో పెట్టిన విద్య అని కోటేశ్వరరావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘మేము డబ్బులు పెట్టి గరుడ వేగ తీస్తే సంజయ్ లాల్వా అనే వ్యక్తికి అమ్మారు. మోసాలు కప్పిపుచ్చుకోవడానికి వారు ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్టీలు మారుస్తున్నారు. ప్రజలకు సేవ చేయడానికి కాకుండా వాళ్ల సంరక్షణ కోసమే ఇలా చేస్తున్నారు. ఇకపై వారి ఆటలు సాగవు. మేము ఇచ్చిన డబ్బులకు సంబంధించి రాజశేఖర్, జీవిత ఇచ్చిన చెక్కులు  చెల్లుబాటు కాలేదు. ఈ చెక్ బౌన్స్ పై నగరి కోర్టు వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది’ అని కోటేశ్వరరాజు అన్నారు. కోటేశ్వరరాజు ఆరోపణలపై శనివారం స్పందించబోతున్నట్లు రాజశేఖర్ ప్రకటించారు.  ఈ ఆరోపణలపై రాజశేఖర్ ఏమని సమాధానం చెబుతారన్నది ప్రస్తుతం టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 2017లో రూపొందిన పి.ఎస్. వి గరుడవేగ చిత్రంతో సుదీర్ఘ విరామం తర్వాత రాజశేఖర్ చక్కటి విజయాన్ని అందుకున్నారు. 

Whats_app_banner

సంబంధిత కథనం