Munugode ByPoll : ప్రభుత్వ ఉద్యోగులపై కేసీఆర్ ఫోకస్
Munugdoe By Election : మునుగోడు అసెంబ్లీలో ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ అనుకుంటోంది. మరోవైపు ప్రతిపక్షాలు సైతం గట్టిగా పోరాడుతున్నాయి. ఏ ఒక్క ఓటును కూడా వదిలిపెట్టొద్దని పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వం కన్నేసినట్టుగా కనిపిస్తోంది.
మునుగోడు అసెంబ్లీ(Munugode Assembly)నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేసిన టీఆర్‌ఎస్(TRs) నాయకత్వం ప్రభుత్వ ఉద్యోగుల ఓటుబ్యాంకుపై దృష్టి సారించింది. దాదాపు 5,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు నియోజకవర్గంలోనే ఉంటారని, వారి కుటుంబ సభ్యులను కలుపుకొంటే వారి సంఖ్య 10,000కు చేరుతుందని చెబుతున్నారు.
ఇది కాకుండా టీఎస్‌ఆర్‌టీసీ(TSRTC) ఉద్యోగులు, వారి కుటుంబాలు దాదాపు 6,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 16,000 మంది ఓటర్లు ఇప్పుడు చాలా కీలకం. దీంతో వారిపై సీఎం కేసీఆర్(KCR) దృష్టిపెట్టారని తెలుస్తోంది. ఒక్క ఓటు కూడా వేరే పార్టీకి పడకుండా చూసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులను గెలిపించే మార్గాలపై చర్చించేందుకు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. బేగంపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఉద్యోగుల సంఘాల నేతలతో సమావేశమవుతున్నారు. టీఎన్‌జీఓలు, టీజీఓలు, ఉపాధ్యాయ సంఘాలు, టీఎస్‌ఆర్‌టీసీ, ఇతర సంస్థల చీఫ్‌లతో ఆయన మాట్లాడుతున్నట్టుగా సమాచారం.
పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలతోపాటుగా ఇతర డిమాండ్లను ప్రభుత్వం క్లియర్ చేసే అవకాశం ఉంది. 2017 నుంచి వాయిదా పడుతూ వస్తున్న టీఎస్‌ఆర్‌టీసీ సిబ్బందికి కొత్త పీఆర్సీ ఆమోదించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యూహంలో భాగమేనని భావిస్తున్నారు. ఈ విషయమై టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శనివారం ముఖ్యమంత్రికి వినతిపత్రం అందించగా, వెంటనే సీఎం ఆమోదం తెలిపి పీఆర్సీ(PRC) అమలుకు చర్యలు తీసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు.
దీని తర్వాత రవాణా శాఖ కార్యదర్శి కెఎస్ శ్రీనివాసరాజు పీఆర్‌సీ అమలుకు ఆమోదం కోరుతూ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్‌కు లేఖ రాశారు. ఈసీ ఆమోదం తెలిపితే ఉప ఎన్నికలకు ముందే పీఆర్సీ అమలుపై ప్రకటన వెలువడనుంది. కాకపోతే, నవంబర్ 6న మోడల్ కోడ్ ముగిసిన వెంటనే ప్రకటన వెలువడుతుంది.
సంబంధిత కథనం