Arjun Tendulkar: ముంబయిని వీడనున్న అర్జున్.. ఎందుకో తెలుసా?-arjun tendulkar asks noc from mumbai he likely to play for goa next season ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Arjun Tendulkar: ముంబయిని వీడనున్న అర్జున్.. ఎందుకో తెలుసా?

Arjun Tendulkar: ముంబయిని వీడనున్న అర్జున్.. ఎందుకో తెలుసా?

Maragani Govardhan HT Telugu
Aug 11, 2022 07:58 PM IST

త్వరలో రానున్న దేశవాళీ ప్రీ సీజన్ మ్యాచ్‌ల్లో సచిన్ తెందూల్కర్ తనయుడు అర్జున్‌ గోవా తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు ఎన్ఓసీ కోసం ముంబయి క్రికెట్ అసోసియేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు.

<p>అర్జున్ తెందూల్కర్</p>
అర్జున్ తెందూల్కర్ (Twitter)

క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ తనయుడు అర్జున్ ముంబయిని వదిలేయనున్నాడు. అంటే పూర్తిగా వదిలేయడం కాదులేండి.. అతడు ముంబయి తరఫున కాకుండా గోవా తరఫున తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లను ఆడనున్నాడు. ఈ మేరకు ముంబయి క్రికెట్ అసోసియేషన్‌ అతడికి నో అబ్జక్షన్ సర్టిఫికేట్(NOC)కి దరఖాస్తు చేసుకున్నాడు. అన్నీ కుదిరితే ఈ 22 ఏళ్ల లెఫ్టార్ట్ పేసర్ తన తదుపరి ప్రీ సీజన్ దేశవాళీ డోమస్టిక్ సీజన్‌ను సౌత్-వెస్ట్ జోన్ అయిన గోవా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు.

ముంబయికి చెందిన అర్జున్.. గోవా తరఫున ఆడాలంటే అతడి ముంబయి క్రికెట్ అసోసియేషన్(MCA) అనుమతి కావాల్సి వచ్చింది. దీంతో అతడు ఎన్ఓసీకి అప్లయి చేసుకున్నాడు. అనుమతి లభింస్తే తర్వాతి సీజన్‌ను గోవా తరఫున ఆడనున్నాడు అర్జున్.

"అర్జున్ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాలంటే మైదానంలోనే ఎక్కువ సమయం గడపడం చాలా ముఖ్యం. ఈ మార్పు కాంపీటెటీవ్ మ్యాచ్‌ల్లో అర్జున్ పాల్గొనే అవకాశాన్ని మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నాం. అతడు తన క్రికెట్ కెరీర్‌లో నూతన దశను ప్రారంభించాడు." అని ఎస్ఆర్టీ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది.

గోవా క్రికెట్ అసోసియేషన్‌ అధ్యక్షుడు సూరజ్ లోట్లికర్ అర్జున్ అంశం గురించి స్పందించారు. "మేము అర్జున్ ప్రతిభను గమనించాం. మిడిలార్డర్‌లో మల్టీ స్కిల్స్ కలిగిన ఆటగాళ్లను తీసుకుంటాం. ఈ నేపథ్యంలో అర్జున్ తెందూల్కర్‌ను కూడా గోవా తరఫున చేరాల్సిందిగా ఆహ్వానించాం. మేము ప్రీ సీజన్ ట్రయిల్ మ్యాచ్‌ల్లో అతడిని ఆడిస్తాం. ఆ మ్యాచ్‌ల్లో అతడి ప్రదర్శన బట్టి సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారు." అని తెలిపారు.

అర్జున్ తెందూల్కర్ అండన్-19లో శ్రీలంకపై భారత్ తరఫున 2 టెస్టులు ఆడాడు. ఈ ఏడాది ప్రారంభంలో ముంబయి ప్రాబబిల్టీల్లో వైట్ బాల్ లెగ్ కోసం లిస్టులో ఉన్నాడు. అయితే దేశవాళీ టోర్నీలకు అతడిని పరిగణనలోకి తీసుకెళ్లలేదు. అర్జున్ ఇటీవల కాలంలో ఇంగ్లాండ్‌లో టీ20 మ్యాచ్‌ల్లో ఆడిన ముంబయి ఇండియన్స్ డెవలప్మెంట్ స్క్వాడ్‌లో భాగమయ్యాడు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్