Munugodu Bypoll : మునుగోడులో వారి చుట్టే రాజకీయం..! అసలు మ్యాటర్‌ ఇదే!-key political parties focus caste factors over munugode byelection 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Munugodu Bypoll : మునుగోడులో వారి చుట్టే రాజకీయం..! అసలు మ్యాటర్‌ ఇదే!

Munugodu Bypoll : మునుగోడులో వారి చుట్టే రాజకీయం..! అసలు మ్యాటర్‌ ఇదే!

HT Telugu Desk HT Telugu
Oct 22, 2022 03:38 PM IST

Munugodu Bypoll 2022: తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు బైపోల్ ఉపఎన్నిక కీలకంగా మారింది. వచ్చే ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న ఈ పోరులో ప్రధాన పార్టీలు ఎవరికి వారు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అయితే ఈ ఎన్నికలో మాత్రం.... రాజకీయ పార్టీన్నీ ఆ కులాల చుట్టే తెగ తిరిగేస్తున్నాయి.

మునుగోడులో ఉప ఎన్నిక
మునుగోడులో ఉప ఎన్నిక

Caste Factors in Munugodu Bypoll 2022: మునుగోడు... ఇప్పుడు తెలంగాణలో ఏటుచూసినా ఇదే చర్చ..! ఎవరు గెలుస్తారు..? సెకండ్ ప్లేస్ లో ఎవరుంటారు..? ఇక్కడ ఓడితే ఆ పార్టీ సంగతి అంతేనట కదా...! గెలిస్తే... ఇంకో పార్టీకి తిరుగులేదంట కదా అనే ముచ్చటే నడుస్తోంది..! ఇక నియోజకవర్గంలో చూస్తే మాత్రం... ప్రతి పల్లె ప్రచారంతో మార్మోగిపోతుంది. ప్రధాన పార్టీలుగా ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మాత్రం... ఏ చిన్న ఛాన్స్ వదులుకోవడానికి సిద్ధంగా లేవు. విక్టరీనే లక్ష్యంగా... చకచకా పావులు కదిపేస్తున్నాయి. అయితే ఇందులో ఓ ఫార్ములాపై టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తెగ ఫోకస్ చేస్తున్నాయి. ఎన్ని వ్యూహాలు, ఎత్తుగడలు వేసినప్పటికీ.... ఈ విషయంలో మాత్రం నిరంతరం ఓ కన్నేసి ఉంచుతున్నాయట..! వారు ఏ మాత్రం హ్యాండిచ్చినా పరిస్థితి తారుమారైపోయే ఛాన్స్ ఉందనే భయమే ఇందుకు కారణమట! అసలు ప్రధాన పార్టీల భయమేంటి..? మ్యాటర్ ఏంటనేది చూస్తే….!

అసలు విషయం ఇదే...

మునుగోడులో బీసీ సామాజికవర్గాల ఓట్లు అత్యధికం..! అందులోనూ అత్యంత ప్రభావితం చేసే వర్గాలు గౌడ, ముదిరాజ్, యాదవ, పద్మశాలి! దాదాపు గెలుపు ఓటములను డిసైడ్ చేయటంలో వీరిది కీ రోల్ అని చెప్పేయవచ్చు.! 35వేలకు పైగా ఓట్లు గౌడ, మరో 30వేలకు పైగా ముదిరాజ్ సామాజికవర్గం ఉంది. ఇక యాదవ సామాజికవర్గానికి సంబంధించి 20వేలకు పైగా, పద్మశాలి వర్గానికి సంబంధించి... 15వేల లోపు ఓట్లు ఉన్నాయి. దాదాపు వీరి ఓట్లే లక్షకు చేరువలో ఉన్నాయి. ఈ వర్గాలు ఏ పార్టీవైపు కాస్త మొగ్గుచూపితే... ఆ అభ్యర్థి గెలుపు సునాయసం అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలుగా బరిలో ఉన్న కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ వీరిపై ఫోకస్ పెట్టింది.

జోరుగా సమ్మేళనాలు....

ఇక నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జోరుగా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన పలు సామాజికవర్గాల సమ్మేళనాలు నిర్వహిస్తున్నాయి. ఆయా రాజకీయాపార్టీల డైరెక్షన్ లోనే ఇవన్నీ నడుస్తున్నాయి. కుల సంఘాల పెద్దలను గ్రిప్ లో ఉంచుకొని వీటిని నిర్వహించేలా పావులు కదుపుతున్నాయి. ఈ లెక్కల్లో టీఆర్ఎస్, బీజేపీ దూకుడుగా ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే పద్మశాలీల సమ్మేళనాలు పూర్తి కాగా... రేపోమాపో గౌడ సామాజికవర్గ సమ్మేళనాలను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక మునుగోడులో ముదిరాజ్ కుల సమ్మేళనం కూడా ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో... ఆయా వర్గాలపై ఓ కన్నేసి ఉంచుతున్నాయి టీఆర్ఎస్, బీజేపీలు! ఏ మాత్రం అటుఇటు అయితే... తమ పరిస్థితి తలకిందులవుతుందని భావిస్తున్నారట..! ఈ క్రమంలో ఎలాగైనా ఆయా వర్గాల ఓట్లను ఆకర్షించేందుకు ఎలాంటి హామీలైనా ఇచ్చేందుకు తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారట.!

మొత్తంగా మునుగోడు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారటంతో... ప్రతి ఓటు కూడా చాలా విలువైనదిగా మారింది. ఈ క్రమంలో ఏ ఒక్క ఓటును కూడా మిస్ కాకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలు తమ వంతు ప్రయత్నాలు సీరియస్ గా చేస్తున్నాయి.

సామాజికవర్గాల వారీగా...

గౌడ్ - 35,150 మంది 15.94%

ముదిరాజ్- 33, 900 (15.37శాతం)

ఎస్సీ మాదిగ - 25 ,650 మంది (11.6 3 శాతం)

యాదవ - 21, 360 (ఓటు షేర్ 9.69)

పద్మశాలీలు - 11, 680 (ఓటు శాతం 5.30 శాతం)

ఎస్టీ లంబాడి/ ఎరుకల - 10,520 మంది (4.7 శాతం)

ఎస్సీ (మాల)- 10,350 మంది

వడ్డెర - 8,350 మంది

కుమ్మరి -7,850 మంది ఓటర్లు,

విశ్వబ్రాహ్మణ/ విశ్వకర్మ- 7,820

రెడ్డి- 7,690 మంది

ముస్లింలు - 7,650

కమ్మ - 5,680 మంది

ఆర్య వైశ్య - 3,760 మంది

వెలమ - 2,360 మంది,

మున్నూరు కాపు - 2,350 మంది,

ఇతరులు 18,400 మంది

Whats_app_banner