Liquor Sales In Munugode : మునుగోడులో మద్యం ఏరులై పారుతోంది.. ఇదిగో వివరాలు-liquor sales all time record in munugode ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Liquor Sales In Munugode : మునుగోడులో మద్యం ఏరులై పారుతోంది.. ఇదిగో వివరాలు

Liquor Sales In Munugode : మునుగోడులో మద్యం ఏరులై పారుతోంది.. ఇదిగో వివరాలు

Anand Sai HT Telugu
Oct 19, 2022 06:43 AM IST

Munugode By Election :మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ దగ్గర పడుతోంది. ఇప్పటికే మద్యం అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డును చేరుకున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మునుగోడు(Munugdoe)లో మద్యం ఏరులై పారుతోంది. ఎప్పుడూ లేని విధంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నవంబర్ 3న ఉపఎన్నిక పోలింగ్(Bypoll Polling) తేదీ దగ్గర పడుతుండడంతో మద్యం అమ్మకాలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) కాంగ్రెస్ పార్టీని వీడి, ఎమ్మెల్యే పదవికి రాజీనిమా చేసిన ఆగస్టుకు ముందు మునుగోడు(mungodu) నియోజకవర్గంలో నెలకు రూ.100 కోట్లలోపే మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.

ఆగస్టులో మద్యం విక్రయాలు రూ. 100 కోట్ల మార్కును దాటాయని, సెప్టెంబర్‌లో రూ. 150 కోట్ల మార్కుకు చేరుకున్నాయి. అక్టోబర్‌లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మద్యంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించడంతో రూ.200 కోట్ల మార్కును దాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. నియోజకవర్గంలో 29 మద్యం దుకాణాలు(Liqour Shops) ఉండగా ఆగస్టు నుంచి ఒక్కో దుకాణంలో రెండు రెట్లకు పైగా విక్రయాలు పెరిగాయి. ఈ నెల 15 రోజుల్లోనే మునుగోడులో రూ.90 కోట్ల మద్యం విక్రయాలు జరగగా, ఎన్నికల రోజు దగ్గర పడుతున్న కొద్దీ అక్టోబర్ 31 నాటికి ఎన్నడూ లేని విధంగా రూ.200 కోట్ల విక్రయాలు జరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆగస్టు 2న రాజ్‌గోపాల్‌రెడ్డి(Rajagopal Reddy) రాజీనామా చేయడంతో ఉపఎన్నిక జరుగుతుందని స్పష్టం కావడంతో ఆగస్టు నుంచి మునుగోడులో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్), ప్రతిపక్ష కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు, మద్దతుదారులు ఆగస్టు 3 నుండి నియోజకవర్గానికి చేరుకోవడం ప్రారంభించారు.

ప్రతి పార్టీ పార్టీ కార్యకర్తలు, ఓటర్ల కోసం రాత్రిపూట మద్యం పార్టీలు నిర్వహిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. దీని కారణంగా అక్టోబర్‌లో మునుపెన్నడూ లేని విధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 5న దసరా(Dasara) పండుగకు అన్ని ప్రధాన పార్టీలు ఇంటింటికీ మద్యం సరఫరా చేశాయని, ఇది కూడా అధిక విక్రయాలకు దోహదపడిందని విమర్శలు ఉన్నాయి.

ఉప ఎన్నికల నోటిఫికేషన్(Bypoll Notification) వెలువడకముందే లేదా పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయకముందే మూడు ప్రధాన పార్టీలు రాష్ట్ర స్థాయి నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గంలో బహిరంగ సభలు నిర్వహించడం ప్రారంభించాయి. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో ఓటర్లతో సమావేశాలు నిర్వహించడంతోపాటు ఓటర్లకు భోజనంతో పాటు మద్యం కూడా ఉచితంగా అందజేసేందుకు పార్టీలు పోటీ పడుతున్నాయి. దీంతో ఆగస్టు, సెప్టెంబరులో మద్యం విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి.

వివరాలు ఇలా ఉన్నాయి

ఆగస్టులో రూ.100 కోట్లు

సెప్టెంబర్ లో రూ.150 కోట్లు

అక్టోబర్‌లో రూ.200 కోట్ల మార్కు వచ్చే అవకాశం ఉంది

మునుగోడులో 29 మద్యం దుకాణాలు

IPL_Entry_Point