Munugode By Election : మునుగోడు పోరులో ఏ పార్టీలు ఉన్నాయి? మెుత్తం ఎంతమంది?-how many parties contestant in munugode by election here is details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  How Many Parties Contestant In Munugode By Election Here Is Details

Munugode By Election : మునుగోడు పోరులో ఏ పార్టీలు ఉన్నాయి? మెుత్తం ఎంతమంది?

HT Telugu Desk HT Telugu
Oct 16, 2022 07:11 PM IST

Munugode Bypoll Candidates : మునుగోడు ఉపఎన్నిక దగ్గర పడుతోంది. పార్టీలన్నీ ప్రచారంలో మునిగిపోయాయి. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవట్లేదు. అయితే ఇక్కడ బరిలో మాత్రం భారీగానే అభ్యర్థులు ఉన్నారు.

మునుగోడులో ఎన్నికల ప్రచారం
మునుగోడులో ఎన్నికల ప్రచారం

మునుగోడు ఉపఎన్నిక(Munugode Bypoll)పై అందరికీ ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలో ఎవరు గెలుస్తారా అని ఎదురుచూస్తున్నారు. అయితే ప్రధాన పార్టీలైన బీజేపీ(BJP), టీఆర్ఎస్(TRS), కాంగ్రెస్(Congress)తోపాటుగా.. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా చాలామందే నామినేషన్ దాఖలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక(Munugode Assembly Bypoll)కు 130 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 83 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. 47 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి(Kusukuntla Prabhakrreddy), కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి , బీఎస్పీ(BSP) అభ్యర్థి ఆందోజు శంకరచారి నామినేషన్లు స్వీకరించారు.

వీటితో పాటు నమోదైన 10 రాజకీయ పార్టీల నామినేషన్లు కూడా పరిశీలనలో చెల్లుబాటయ్యాయి. యుగ తులసి పార్టీ తరపున శివ కుమార్ కొలిశెట్టి, ప్రజావాణి పార్టీ లింగిడి వెంకటేశ్వర్లు, తెలంగాణ సకల జనుల పార్టీ నుండి నందిపార్టీ జానయ్య, తెలంగాణ జన సమితి తరపున పల్లె వినయ్ కుమార్, జాతీయ నవక్రాంతి పార్టీ నుండి కంభంపాటి సత్యనారాయణ, సామాజిక పరిరక్షణ పార్టీ తరపున మారగోని శ్రీశైలం, సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి పాల్వాయి వేణు, ప్రజా ఏక్తా పార్టీకి చెందిన బత్తుల దిలీప్, తెలంగాణ జాగీర్ పార్టీకి చెందిన జె.ప్రతాప్ సింహా రెడ్డి రాయుడు, తెలంగాణ రిపబ్లిక్ పార్టీకి చెందిన నూక్ యాదీశ్వర్ నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి.

69 మంది స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు కూడా ఆమోదించారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 17వరకు ఉంది.

ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(komatirreddy Rajagopalreddy) నవంబర్ 3 తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. అయితే కోమటిరెడ్డి సాయి తేజా రెడ్డిని అనే వ్యక్తి కూడా ఈ ఎన్నిక బరిలో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి(Palvai Sravanthi), బీజేపీ అభ్యర్థి రాజ్‌గోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ క్యాండిడెట్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి(kusukuntla Prabhakar Reddy) నుండి గట్టి సవాలును ఎదుర్కొంటున్నారు. మరోవైపు పాల్వాయి ఇంటిపేరుతో మరో ఇద్దరు బరిలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీల్లో అధికార టీఆర్‌ఎస్‌(TRS)కు చెందిన ప్రభాకర్ రెడ్డికి మాత్రమే తన పేరుతో వచ్చి నామిమేషన్ వేసిన వాళ్లు కనిపించలేదు.

IPL_Entry_Point