Rahul Bharath jodo Yatra : ఏపీలోకి నేడు ఎంట్రీ, తెలంగాణలో రూట్ మ్యాప్…-rahul bharath jodo yatra will enter in andhrapradesh today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Rahul Bharath Jodo Yatra Will Enter In Andhrapradesh Today

Rahul Bharath jodo Yatra : ఏపీలోకి నేడు ఎంట్రీ, తెలంగాణలో రూట్ మ్యాప్…

HT Telugu Desk HT Telugu
Oct 14, 2022 06:33 AM IST

TS Bharath jodo Yatra కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్రకు ఫైనల్ రూట్ మ్యాప్‌ను ఖరారు చేశారు. టీపీసీసీ రూపొందించిన రూట్ మ్యాప్‌కు అమోద ముద్ర వేశారు. రూట్‌ మ్యాప్‌ విషయంలో ఇప్పటికే పలుమార్లు సమీక్షలు, సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎట్టకేలకు రాహుల్ ప్రయాణించే మార్గాన్ని ఖరారు చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు ఏపీలో ప్రవేశించనుంది.

నేడు కర్ణాటక నుంచి ఏపీలో అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
నేడు కర్ణాటక నుంచి ఏపీలో అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (PTI)

Bharath Jodo Yatra రాహుల్‌గాంధీ చేపట్టిన ' భారతో జోడో ' పాదయాత్రకు సంబంధించిన తెలంగాణ రూట్‌ మ్యాప్‌ ఫైనల్‌ అయింది. తెలంగాణ పీసీసీ రూపొందించిన రూట్‌ మ్యాప్‌‌కు పార్టీ కేంద్ర నాయకత్వం అమోద ముద్ర వేసింది. రాహుల్ గాంధీ చేపట్టే త్ర రూట్‌ మ్యాప్‌ విషయంలో పార్టీకి చెందిన ఢిల్లి పెద్దలు, టీ పీసీసీ నాయకులు పలుమార్లు సమవేశాలు, సమీక్షలు నిర్వహించారు. రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు, సూచనల మేరకు ఇప్పటికే రెండు సార్లు పాదయాత్ర రూట్‌ను మార్చారు. శుక్రవారం రాహుల్ యాత్ర ఏపీలోకి ప్రవేశిస్తుండటంతో రూట్ మ్యాప్‌ను ఫైనల్‌ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం గాంధీభవన్‌లో భారత్‌ జోడో యాత్రపై జరిగిన సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కేసీ వేణుగోపాల్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌, ఏఐసీసీ కార్యదర్శులు, రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యనేతలు హాజరయ్యారు.

రాహుల్‌ పాదయాత్ర ఆక్టోబర్‌ 23న కర్ణాటక నుంచి కృష్ణానది మీదుగా తెలంగాణలోని మక్తల్‌ అసెంబ్లి నియోజక వర్గంలోకి ప్రవేశిస్తుంది. నవంబర్‌ 6 వరకు రాష్ట్రంలో యాత్ర కొనసాగి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. రాష్ట్రంలో 375 కిలోమీటర్ల మేరకు రాహుల్‌ పాదయాత్ర కొనసాగనుంది. మొదట ఖరారు చేసిన రూట్‌ మ్యాప్‌ ప్రకారం హైదరాబాద్‌ నగరంలోకి ప్రవేశించ కుండానే ఔటర్‌ రింగ్‌రోడ్డు నుంచి పఠాన్‌చెరువు, సంగారెడ్డి మీదుగా జోగిపేట్‌, మద్నూర్‌ నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించే విధంగా రూట్‌ మ్యాప్‌ను ఖరారు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఔటర్‌ రింగ్‌రోడ్డు నుంచి వెళ్లడం వల్ల పార్టీకి ఎలాంటి లాభం ఉండదని, రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం చెప్పడంతో, నిర్ణయం మార్చుకుని నగరం నుంచి వెళ్లే విధంగా ఫైనల్‌ చేశారు.

రాహుల్‌ పాదయాత్ర చేసే రూట్‌..

రాహుల్‌గాంధీ పాదయాత్ర అక్టోబర్‌ 23న రాష్ట్రంలోకి కృష్ణా వంతెన మీదుగా మక్తల్‌కు వస్తుంది. అక్కడి నుంచి దేవరకద్ర, మహబూబ్‌నగర్‌ పట్టణం, జడ్చర్ల, షాద్‌నగర్‌, శంషాబాద్‌, అరంఘార్‌, బహూదుర్‌పూరా, చార్మినార్‌, అప్జల్‌గంజ్‌, మోజాంజాయి మార్కెట్‌, గాంధీభవన్‌, నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాందీ విగ్రహం, బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌, బాలానగర్‌, ముసాపేట్‌ వై జంక్షన్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌, బెల్‌, పఠాన్‌చెరువు, ముత్తంగి ఓఆర్‌ఆర్‌, సంగారెడ్డి చౌరస్తా, సంగారెడ్డి రిజర్వ్‌ఫారెస్టు, జోగిపేట్‌, శంకరంపేట్‌, మద్నూర్‌ మీదుగా రాహుల్‌ గాంధీ పాదయాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది.

నగరంపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి..

రాహుల్‌ పాదయాత్ర గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి నుంచి వెళ్లే విధంగా కాంగ్రెస్‌ నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రేటర్‌లో బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌ యాత్ర వల్ల లాభం జరుగుతుందనే భావనలో ఉన్నారు. బీజేపీ ఏ కార్యక్రమం చేపట్టిన భాగ్యలక్ష్మి టెంపుల్‌ నుంచే ప్రారంభించడం లేదంటే కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చి సెంటిమెంట్‌న్‌ రగిలించే కార్యక్రమం చేస్తున్నారని చెబుతున్నారు. అందుకు రాహల్‌ పాదయాత్ర చార్మినార్‌, పాతబస్తీలో ఉండే విధంగా ప్లాన్‌ చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

గతంలో రాజీవ్‌గాంధీ సద్భావన యాత్రను చార్మినార్‌ నుంచే చేపట్టారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు గుర్తు చేశారు. ఇందిరగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 31న నెక్లెస్‌ రోడ్డులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ బహిరంగ సభకు భారీ జన సమీకరణ చేయాలని, ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

నేడు ఏపీలోకి రాహుల్‌ పాదయాత్ర…..

కర్ణాటక చిత్రదుర్గలో 36వ రోజు రాహుల్‌ జోడోయాత్ర కొనసాగింది.. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు మొత్తం 930 కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేసుకున్నారు రాహుల్‌. శుక్రవారం రాహుల్‌ ఏపీలోకి అడుగుపెట్టనున్నారు. సత్యసాయి జిల్లా డీ హీరేహళ్ ‌గ్రామంలోకి రాహుల్‌ యాత్ర అడుగుపెడుతోంది.

ఏపీలో ప్రవేశించిన తర్వాత రాహుల్ యాత్ర నాలుగు రోజుల పాటు విరామం ఇస్తారు. ఆ తరవాత నాలుగు రోజుల పాటు ఏపీలో యాత్ర కొనసాగుతుంది. ఏపీలో 90 కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర కొనసాగనుంది. అటు తెలంగాణలో 375కిలోమీటర్ల పొడవున రాహుల్ నడక సాగనుంది. తెలంగాణలో మొత్తం 375 కిలోమీటర్ల మేర రాహుల్‌ పాదయాత్ర సాగనుంది.. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ దగ్గర తెలంగాణలోకి రాహుల్ గాంధీ అడుగుపెడతారు.

హైదరాబాద్‌లో రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్‌లో స్వల్ప మార్పులు చేశారు. చార్మినార్‌ నుంచి ప్రారంభం కానున్న యాత్ర.. గాంధీ భవన్‌, ఇందిరా విగ్రహం వరకు కొనసాగుతుంది. అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ తరువాత ఇందిరా గాంధీ విగ్రహం నుండి బోయిన్ పల్లిలో గాంధీ ఐడియాలజీ కేంద్రం, బాలానగర్, ముసాపేట, కూకట్ పల్లి, మియాపూర్, బెల్‌ మీదుగా పటాన్‌చెరుకు చేరుకుంటుంది. తెలంగాణలో మొత్తం 375 కిలోమీటర్ల మేర రాహుల్‌ భారత్ జోడో యాత్ర జరగనుంది.

IPL_Entry_Point