Centre on Kohinoor : ‘కోహినూర్​ను ఇండియాకు తీసుకొస్తాము’- కేంద్రం-india will continue to explore ways to bring back kohinoor from uk centre ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  India Will Continue To Explore Ways To Bring Back Kohinoor From Uk: Centre

Centre on Kohinoor : ‘కోహినూర్​ను ఇండియాకు తీసుకొస్తాము’- కేంద్రం

Sharath Chitturi HT Telugu
Oct 15, 2022 08:05 AM IST

Centre on Kohinoor : కోహినూర్​ను ఇండియాకు తిరిగి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని కేంద్రం చెప్పింది. కొన్నేళ్లుగా ఈ విషయాన్ని బ్రిటన్​ ప్రభుత్వం వద్ద ప్రస్తావిస్తున్నామని వెల్లడించింది.

క్వీన్​ ఎలిజబెత్​ తలపై కోహినూర్​ కిరీటం
క్వీన్​ ఎలిజబెత్​ తలపై కోహినూర్​ కిరీటం

Centre on Kohinoor : ప్రపంచంలోనే అత్యంత విలువైన 'కోహినూర్​'ను బ్రిటన్​ నుంచి ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని కేంద్రం వెల్లడించింది. కోహినూర్​ను వెనక్కి తీసుకు రావడానికి ఉన్న అని మార్గాలను అన్వేషిస్తామని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

క్వీన్​ ఎలిజబెత్​ 2 మరణం తర్వాత ఈ కోహినూర్​ వ్యవహారం మళ్లీ వార్తల్లో నిలిచింది. కోహినూర్​ను ఇండియాకు తీసుకురావాలని డిమాండ్లు మళ్లీ పెరిగాయి. ఈ విషయంలో తాజాగా విదేశాంగశాఖ ప్రతినిధి ఆరిదమ్​ బగ్చి స్పందించారు.

"కొన్నేళ్ల క్రితమే పార్లమెంట్​లో.. ఈ విషయంపై కేంద్రం తన వైఖరిని స్పష్టంగా చెప్పింది. బ్రిటన్​ ప్రభుత్వంతో కోహినూర్​ విషయాన్ని ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాము. కోహినూర్​ను ఇండియాకి తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తాము," అని ఆరిందమ్​ బగ్చి తెలిపారు.

బ్రిటన్​లో 'కోహినూర్​'..

Kohinoor diamond India : 1849 వరకు కోహినూర్​ ఇండియాలోనే ఉండేది. మహారాజ దులీప్​ సింగ్​.. 108 క్యారెట్​ కోహినూర్​ను క్వీన్​ విక్టోరియాకు బహుమతిగా ఇచ్చారని కొందరు చెబుతూ ఉంటారు. 1937 క్వీన్​ తల్లి దానిని ధరించారు.

ఎలిజబెత్​ మరణం అనంతరం కోహినూర్​ ఉన్న కిరీటం ఎవరికి దక్కుతుంది? అన్న అంశంపై తీవ్ర చర్చలు జరిగాయి. అందుకు తగ్గట్టుగానే సామాజిక మాధ్యమాల్లో ‘కోహినూర్’​ ట్రెండింగ్​గా మారింది. అయితే.. కోహినూర్​పై 100శాతం హక్కులు ఇండియాకే ఉన్నాయని, దానిని తిరిగి ఇచ్చేయాలని వేలాది మంది ట్వీట్ల వర్షం కురిపించారు. ఫలితంగా ఈ కోహినూర్​ వ్యవహారం అప్పటి నుంచి హాట్​టాపిక్​గా మారింది.

అయితే ఈ కోహినూర్​ డైమండ్​పై అనేక కథలు ఉన్నాయి. ఇది పూరీ జగన్నాథుడికి చెందినదని పలువురు అభిప్రయాపడుతున్నారు.

"ఆ కోహినూర్​ డైమండ్​ శ్రీ జగన్నాథుడికి చెందినది. మహారాజా రంజిత్​ సింగ్​.. దానిని జగన్నాథ భగవానుడికి విరాళంగా ఇచ్చారు. కానీ ఇప్పుడు అది క్వీన్​ ఆఫ్​ ఇంగ్లాండ్ వద్ద ఉంది.​ దానిని వెనక్కి తీసుకురావాలని మీరు ప్రధానికి విజ్ఞప్తి చేయండి," అని గత నెలలో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందించిన మెమొరాండమ్​లో పేర్కొంది ఒడిశాకు చెందిన శ్రీ జగన్నాథ్​ సేన.

Kohinoor history : చరిత్రకారుల ప్రకారం.. పంజాబ్​ మహారాజు రంజిత సింగ్​, అఫ్గానిస్థాన్​ రాజు నదీర్​ షాపై యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో గెలిస్తే పూరీ జగన్నాథుడికి కోహినూర్​ని విరాళంగా ఇస్తానని ఆయన మొక్కుకున్నారు. నదీర్​ షాపై జరిగిన యుద్ధంలో ఆయన విజయం సాధించారు. కానీ.. కోహినూర్​ని పూరీ జగన్నాథుడికి ఇవ్వలేదు!

1839లో రాజా రంజిత్​ సింగ్​ మరణించారు. 10ఏళ్ల తర్వాత.. రంజిత్​ సింగ్​ కుమారుడు దులీప్​ సింగ్​ నుంచి బ్రిటీషర్లు ఆ కోహినూర్​ డైమండ్​ను తీసుకుని ఇంగ్లాండ్​కు పట్టుకెళ్లిపోయారని కొందరు చెబుతూ ఉంటారు. అప్పటి నుంచి అది ఇండియాకు తిరిగిరాలేదు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్