TS High Court : మునుగోడు ఉపఎన్నికపై హైకోర్టులో పిటిషన్
Munugode By Election : మునుగోడు ఉపఎన్నికపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జులై 31 వరకు ఉన్న ఓటర్ లిస్టునే పరిగణనలోకి తీసుకునే విధంగా ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ వేసింది బీజేపీ.
మునుగోడులో జులై 31 వరకు ఉన్న ఓటర్ లిస్టునే పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ హైకోర్టుకు వెళ్లింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. ఫార్మ్ 6 కింద అప్లై చేసుకున్న వారిలో ఫాల్స్ ఓటర్లు ఉన్నారని పేర్కొంది. తక్కువ టైమ్ లో సుమారు 25 వేల దరకాస్తులు వచ్చాయని తెలిపింది. ఈ నెల 14 న ఓటర్ లిస్ట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించనుందని, హైకోర్ట్ ఆదేశించే వరకు లిస్ట్ ప్రకటించ వద్దని ఆదేశాలు జారి చేయాలని కోరింది బీజేపీ.
ట్రెండింగ్ వార్తలు
వచ్చే నెల 3న మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఓటర్లు పెద్ద ఎత్తున నమోదు చేసుకుంటున్నారు. దీనిపై బీజేపీ మండిపడుతోంది. ఓట్ల నమోదుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై హైకోర్టు ఎల్లుండి విచారణ చేస్తుంది. ఈ నెల 14న ఈసీ మునుగోడు ఓటరు జాబితాను ప్రకటిస్తుంది. హైకోర్టు ఆదేశించే వరకు లిస్ట్ ప్రకటించకుండా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ కోర్టును కోరింది.
మరోవైపు ఇప్పటికే కారు(Car)ను పోలిన పలు గుర్తులను తొలగించాలంటూ ఈసీ(EC)ని ఆశ్రయించింది టీఆర్ఎస్. కారును పోలిన గుర్తులతో గతంలో టీఆర్ఎస్(TRS) అభ్యర్థులకు నష్టం జరిగిందని వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నిక(Munugode Bypoll)ల్లో కారును పోలిన 8 గుర్తులు ఉన్నాయని, అయితే వాటిని తొలగించాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. టీఆర్ఎస్ నేతలు దాస్యం వినయ్ భాస్కర్, భాను ప్రసాదరావు, భరత్ కుమార్.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌కు కలిశారు. ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు.
ఎన్నికల గుర్తులైన కెమెరా, చపాతీ రోలర్, డాలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టుమిషన్, ఓడను తొలగించాల టీఆర్ఎస్ నేతలు వినతిపత్రం ఇచ్చారు. 48 గంటల్లో స్పందించకపోతే కోర్టు(Court)ను ఆశ్రయిస్తామని చెప్పారు. 2018 ఎన్నికల్లో కారును పోలిన గుర్తులతో టీఆర్ఎస్(TRS) అభ్యర్థులకు నష్టం జరిగిందని టీఆర్ఎస్ నేతలు చెప్పారు. ఈ గుర్తులతో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు.
నర్సంపేట(Narsampeta), చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్‌లో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ(BSP), సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయని టీఆర్ఎస్ నేతలు అన్నారు. 8 గుర్తులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా.. కేసీఆర్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. బండి సంజయ్(Bandi Sanjay)పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టాపిక్