Kashmiri Halwa Recipe : ఈ దసరా పండుగకి.. కశ్మీరీ హల్వా ఇలా చేసేయండి..
Kashmiri Halwa Recipe : పండుగ సమయంలో స్వీట్స్ చేసుకోవడం ఆనవాయితీ. అయితే స్వీట్స్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ అని చెప్పవచ్చు. కానీ సింపుల్‌గా, టేస్టీగా తయారు చేసుకోగలిగే అద్భుతమైన స్వీట్ రెసిపీ ఇక్కడ ఉంది. అదే కశ్మీరీ హల్వా. మరి దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Kashmiri Halwa Recipe : ఈరోజు దసరా పండుగా. తెలుగు రాష్ట్రాలు పండుగ వాతావరణంలో హడావిడిగా కళకళలాడిపోతున్నాయి. మరి ఈ సమయంలో పూజకోసం, మన కోసం కూడా ఓ చక్కని స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి మనం ఈరోజు సింపుల్‌గా, టేస్టీగా తయారు చేసుకోగలిగే కశ్మీరీ హల్వాను తయారు చేసుకుందాం. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
* ఓట్స్ - 1 కప్పు
* పంచదార - అరకప్పు
* పాలు - 2 కప్పులు
* నెయ్యి - 4 టీస్పూన్స్
* ఏలకుల పొడి - 1 టీస్పూన్
* కుంకుమపువ్వు - కొంచెం
* జీడిపప్పు - మీ టేస్ట్‌కి తగ్గట్లు
* బాదం పప్పు - మీ టేస్ట్‌కి తగ్గట్లు
* ఎండుద్రాక్ష - మీ టేస్ట్‌కి తగ్గట్లు
తయారీ విధానం
ముందుగా నాన్ స్టిక్ పాన్ తీసుకోండి. దానిలో 2-3 టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. దానిలో ఓట్స్ వేసి.. అవి రంగు మారే వరకు తక్కువ వేడి మీద ఫ్రై చేయండి.
ఇప్పుడు మరో పాన్‌లో పాలు, పంచదార వేసి.. మరిగించండి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత.. వేయించిన ఓట్స్ వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గరగా అయ్యేవరకు దానిని కలుపుతూ ఉండాలి. కుంకుమపువ్వుని పాలల్లో నానబెట్టి.. ఆ మిశ్రమంలో వేసి.. బాగా కలపాలి. ఇప్పుడ స్టవ్ ఆపేసి.. దానిలో నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష వేసి.. సర్వ్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ కశ్మీరీ హల్వా రెడీ.
సంబంధిత కథనం