Dussehra 2022 : విజయదశమి తిథి ఎప్పుడు మొదలవుతుంది.. ఎప్పుడు ముగుస్తుంది అంటే..
Dussehra 2022 : దుష్ట సంహారానికి ప్రతీకగా రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేయడం, బాణాసంచా కాల్చడం వంటివి.. దసరా సాంప్రదాయకంగా చేస్తారు. అయితే మరి ఈ సంవత్సరం దసరా ఎప్పుడు వస్తుంది. విజయదశమి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Dussehra 2022 : అత్యంత పవిత్రమైన భారతీయ పండుగలలో దసరా ఒకటి. దీనిని అక్టోబర్ 5, 2022 (రేపు) జరుపుకుంటున్నారు. హిందూ పురాణాల ప్రకారం.. ఈ పండుగ మహిషాసురుడు అనే రాక్షసునిపై దుర్గా దేవి సాధించిన విజయాన్ని గుర్తుగా.. రావణుడిపై రాముడు గెలిచిన దానికి ప్రతికగా చేసుకుంటారు.
ఈ సంవత్సరం దసరా అక్టోబర్ 5వ తేదీన నిర్వహిస్తున్నారు. మరోవైపు నవరాత్రి 2022 అక్టోబర్ 4 నేటితో ముగుస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీనిని చేసుకుంటారు. అందుకే ఈరోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అనేక ప్రాంతాలలో ప్రజలు.. కొత్త వ్యాపారం లేదా కొత్త పెట్టుబడిని ప్రారంభించడానికి ఈరోజు చాలా శుభప్రదమని నమ్ముతారు.
విజయదశమి తిథి
విజయదశమి తిథి అక్టోబర్ 4 మధ్యాహ్నం 02:20 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 5వ తేదీ మధ్యాహ్నం 12:00 గంటలకు ముగుస్తుంది. దసరా రోజు భక్తులు దుర్గా మాతను, రాముడిని ఎక్కువగా పూజిస్తారు. చెడు అంతానికి సూచనగా.. రావణుడి భారీ దిష్టిబొమ్మలను దహనం చేస్తారు.
దుష్ట సంహారానికి ప్రతీకగా రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేయడం, బాణాసంచా కాల్చడం సాంప్రదాయంగా వస్తూ ఉంది. ఈ కార్యక్రమాల్లో పిల్లలనుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో రామలీలా కూడా నిర్వహిస్తారు.
విజయదశమిని దుర్గమ్మ.. రాక్షస రాజైన మహిషాసురుడిని చంపిన దానికి గుర్తుగా మంచిపై చెడు గెలిచినందుకు విజయదశమని భక్తులు నిర్వహిస్తారు. ఇది తొమ్మిది రోజుల పండుగ. ఈ సమయంలో భక్తులు అమ్మవారిని తొమ్మిదిరోజులు.. తొమ్మిది రూపాలల్లో కొలుస్తారు. తొమ్మిదో రోజు అమ్మవారి ప్రతిమలను నిమజ్జనం చేస్తారు.
సంబంధిత కథనం