తెలుగు న్యూస్  /  Telangana  /  Mp Raghu Rama Krishna Raju Denies His Involvement In Trs Mlas Trap By Bjp

RRR Promise : ఒట్టు…. అలాంటి ఆలోచనే లేదు… రఘురామ కృష్ణం రాజు

HT Telugu Desk HT Telugu

26 November 2022, 12:10 IST

    • RRR Promise టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎంపీ రఘురామకృష్ణం రాజుకు సిట్ నోటీసులు జారీ చేయడంతో  విచారణకు హాజరవుతానని ప్రకటించారు. కల్లో కూడా కేసీఆర్‌ ప్రభుత్వానికి హాని చేసే ఆలోచన, ఉద్దేశం తనకు లేదని రఘురామ ప్రకటించారు. 
ఎంపీ రఘురామ కృష్ణంరాజు
ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ఎంపీ రఘురామ కృష్ణంరాజు

RRR Promise ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ నోటీసులు జారీ చేయడంతో ఎంపీ రఘురామ కృష్ణం రాజు స్పందించారు. తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు కలలో కూడా కీడు చేసే ఆలోచన తనకు లేదని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. తాను ఏనాడు కూడా కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది లేదన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, ఆంధ్ర ప్రజలు తెలంగాణకు వలస వెళుతున్నారని తన రచ్చబండ కార్యక్రమంలో గతంలోనే చెప్పానని గుర్తు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Jagtial Crime : జగిత్యాలలో దారుణం, కోడలి మెడ నరికి హత్య చేసిన మామ

Warangal Kidnap : వరంగల్ లో వడ్డీ వ్యాపారి దారుణం, అప్పు తీసుకున్న వ్యక్తి కిడ్నాప్-రూ.28 లక్షలకు బలవంతపు సంతకాలు

TS ICET 2024 Updates : తెలంగాణ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు, మే 7 వరకు ఛాన్స్

Medak Accident: పెళ్లైన మూడు రోజులకే రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం, నవ వధువుకు తీవ్రగాయాలు

తనకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్న పనికిమాలిన ఆలోచనలు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై ఇష్టం ఉన్న వ్యక్తిగా, ఆ ప్రభుత్వానికి హాని చేయాలని ఆలోచన లేదని పునరుద్ఘాటించారు. తెలంగాణలో పని చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులు ఎవరో గుర్తించాలని ముఖ్యమంత్రి కెసిఆర్, టిఆర్ఎస్ శ్రేణులకు రఘురామకృష్ణంరాజు సూచించారు. తెలంగాణ సిట్ పోలీసులు తనకు సీ ఆర్ పీ సీ 41 కింద నోటీసును అందచేశారని చెప్పిన రఘురామ, విచారణకు సహకరిస్తానని... నోటీసులకు సమాధానం ఇస్తానని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వంతో తనకు ఎటువంటి గొడవలు లేవని రఘురామకృష్ణంరాజు తేల్చి చెప్పారు . తెలంగాణ సిట్ పోలీసులు జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇస్తానని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి నీలి నీడలు తెలంగాణ అధికారులపై పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటానని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డితో గొడవలు ఉన్నట్లుగా, తనకు కేసిఆర్ తో లేవన్నారు.

సెటిలర్ ఓట్లపై ప్రభావం…..

తనను ఏమైనా చేస్తే సెటిలర్ల ఓట్లు జారిపోతాయని తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు తెలుసునని రఘురామ చెప్పారు. హైదరాబాదులో తాను కూడా ఒక సెటిలర్ నేనని, అటువంటి పనులను వారు చేస్తారని అనుకోవడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి, తన మాట వినే కొందరు అధికారులను ప్రభావితం చేసి ఇటువంటి పనులు చేయిస్తున్నారని విమర్శించారు. శారదా పీఠం స్వామీజీతో ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్మోహన్ రెడ్డి తో పాటు తన ఫోటోలు కూడా ఉన్నాయన్నారు.

ఫోటోలు దిగితే కలిసి నేరం చేసినట్టా…

ఎవరైనా అభిమానంతో వచ్చి ఒక ఫోటో దిగుతామని అంటే... ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిగా ఫోటో దిగితే అతడు ఏదైనా నేరం చేస్తే, ఫోటో దిగిన పాపానికి కలిసి చేసినట్టు అవుతుందా అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎదుర్కొంటున్న నందకుమార్ ఎవరో తనకు తెలియదన్నారు. కలిసి ఫోటో దిగినంత మాత్రాన, అతనితో తనకు సంబంధాలను అంట గడుతున్నారని చెప్పారు. ఆర్ఎస్ఎస్ లో కీలక నేత దత్తాత్రేయ హోసు బోలే తో పాటు పక్కనే ఉన్న మరొక స్వామీజీతో కలిసి ఫోటో దిగితే, ఇష్టం వచ్చిన రాతలు రాయడానికి సిగ్గుండాలి అని మండిపడ్డారు.

టాపిక్