తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr | అందరూ అలానే అంటే ఎలా.. దేశానికే మనం ఆదర్శంగా ఉండాలి

KTR | అందరూ అలానే అంటే ఎలా.. దేశానికే మనం ఆదర్శంగా ఉండాలి

HT Telugu Desk HT Telugu

13 April 2022, 16:10 IST

    • దళిత బంధుపై మంత్రి కేటీఆర్ మాట్లాడారు. పథకం సఫలమైతే.. దేశం మెుత్తం తెలంగాణ వైపు చూస్తుందని.. కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలతో దళితులు అభివృద్ధి చెందాలని కోరారు.
మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ (twitter)

మంత్రి కేటీఆర్

హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన డా. బీ.ఆర్ అంబేడ్కర్ జయంత్యుత్సవాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పీవీ మార్గ్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహా ప‌నుల‌ను పరిశీలించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ ఏడాది డిసెంబ‌ర్ లోగా ప్రతిష్టించనున్నట్టు కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకంపై మాట్లాడారు. దళిత బంధు సఫలమైతే దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. దళిత బంధు ద్వారా వచ్చే డబ్బులను లబ్ధిదారులు.. సరైన వాటికి ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని కోరారు.

ట్రెండింగ్ వార్తలు

Rythu Bharosa Funds : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, రైతు భరోసా నిధులు విడుదల

Plantix App: మూడు కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్న ప్లాంటిక్స్ యాప్… రైతుల మన్నన పొందుతున్న అప్లికేషన్

Mlc Kavitha Bail Petitions : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, బెయిల్ నిరాకరించిన కోర్టు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

ప్రపంచంలో అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం 55 అడుగులు బేస్, 125 అడుగులు విగ్రహం రెడీ అవుతుందని కేటీఆర్ చెప్పారు. డిసెంబర్ నాటికి విగ్రహం పని పూర్తి అవుతుందని పేర్కొన్నారు. మన దేశ ప్రజలకి ఈ ప్రాంతం స్ఫూర్తి కాబోతోందన్నారు. తెలంగాణ ప్రయోజనాలకి ఎక్కడా భంగం కలిగకుండా అంబేడ్కర్ బాటలో నడుస్తున్నామని కేటీఆర్ చెప్పారు.

'దళితబంధు లబ్ధిదారులు కొత్తగా ఆలోచిస్తే.. సంపద సృష్టి జరుగుతుంది. తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. చాలామంది మేం ట్రాక్టర్లు, హార్వెస్టర్లు కొంటామని చెబుతున్నారు. అలా చేస్తే.. అలా చేస్తే ప్రభుత్వ ఉద్దేశం ఎలా సఫలం అవుతుంది? డిక్కీ సంస్థ ద్వారా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల తయారీ చేసేందుకు కృషి చేస్తున్నాం. నిధులను పక్కాగా ప్లాన్ చేసుకుని.. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి.' అని కేటీఆర్ అన్నారు.

పథకాల అమలులో అందరినీ కలుపుకొని వెళ్దామని కేటీఆర్ అన్నారు. దళితబంధును సమర్థంగా అమలు చేసి.. దేశానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. సత్తా ఉన్నప్పుడు.. పది మందికి అవకాశాలు ఇవ్వగలగలాన్నారు. ఇతరులను విమర్శలు చేయడమే.. కొంతమంది పనిగా పెట్టుకున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిరాశ, నిస్పృహల నుంచి యువత బయటపడాలని కోరారు. ప్రభుత్వం అవకాశాలు ఇచ్చినప్పుడు యువత అందిపుచ్చుకోవాలన్నారు.

టాపిక్