తెలుగు న్యూస్  /  Telangana  /  Minister Errabelli Dayakar Rao In Medaram Jatara

మేడారంలో మంత్రి ఎర్రబెల్లి.. కేసీఆర్ బర్త్‌ డే సందర్భంగా ప్రత్యేక పూజలు

HT Telugu Desk HT Telugu

17 February 2022, 14:49 IST

  • మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజాలు చేశారు.

మేడారంలో మంత్రి ఎర్రబెల్లి
మేడారంలో మంత్రి ఎర్రబెల్లి (twitter)

మేడారంలో మంత్రి ఎర్రబెల్లి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మేడారంలో సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని.. అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని(బెల్లం) సమర్పించారు. కోరిన కోర్కెలు తీర్చే వన దేవతలను దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సమ్మక్క-సారలమ్మల దీవెనలతో కేసీఆర్ అభివృద్ధి పథంలో నిలుపుతున్నారన్నారు. కేసీఆర్ కు అమ్మల ఆశీస్సులు ఉండాలని ప్రత్యేక పూజలు చేసి కోరుకున్నట్టు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

TS 10th Results 2024: నేడే తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదే

Light Beers : తెలంగాణలో లైట్ బీర్లు దొరకడంలేదు, ఎక్సైజ్ అధికారులకు యువకుడు ఫిర్యాదు

CM Revanth Reddy On Notices : బీజేపీని ప్రశ్నిస్తే నోటీసులే, దిల్లీ పోలీసుల సమన్లపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

TS 10th Results 2024 : రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు, హెచ్.టి.తెలుగులో వేగంగా రిజల్ట్స్!

అనంతరం మేడారం జాతర ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. జాతర జరిగే చుట్టుముట్టు 40 నుంచి 50 కి. మీ. మేర జాతర కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సేద తీరుతున్నారు. నిన్న సారలమ్మ గద్దె మీదకు వచ్చింది. చిలుకల గుట్ట నుంచి ఈ రోజు సాయంత్రం సమ్మక్క తల్లి గద్దె మీదకు రానున్నది. దీంతో ఈ రోజు సాయంత్రం సమ్మక్క తల్లి దర్శనం కోసం ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తి వస్తారు.

ఇవాళ సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు సమ్మక్క, సారలమ్మలు గద్దెల పైనే ఉంటారు. దీంతో మేడారం మహా జాతర ప్రధాన ఘట్టం ఈ రోజు సాయంత్రంతో మొదలవుతుంది. మరోవైపు మేడారం జాతరకు రేపు ఉదయం సీఎం కేసీఆర్ రానున్నారు. రోజు మొత్తం మేడారంలోనే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతరలోనే ఉండి అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. మరోవైపు మంత్రి అధికారులతో జాతర పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూన్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

జాతీయ పండగగా గుర్తింపు పొందేందుకు కృషి చేస్తాం

మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను జాతీయ పండుగగా గుర్తింపు పొందేందుకు కృషి చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో మేడారంలో మీడియాతో మాట్లాడారు. దేశంలోనే కుంభమేళా తర్వాత రెండో అతిపెద్ద పండుగగా మేడారం గుర్తింపు పొందిందని ఎర్రబెల్లి అన్నారు. మెుదట్లో లక్షల్లో వచ్చే భక్తులు.. ఇప్పుడు కోటికి పైగా చేరుకున్నారని తెలిపారు. ఏటా పెరుగుతున్న భక్తులను దృష్టిలో పెట్టుకుని.. ఏర్పాట్లు పటిష్టంగా చేస్తున్నట్టు తెలిపారు.

సారలమ్మను వైభవంగా గద్దెల వద్దకు తీసుకొచ్చామన్నారు. భారీ బందోబస్తు నడుమ జిల్లా అధికార యంత్రాంగం, ఆదివాసీల సహకారంతో ఘనంగా తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. గతంలో రాత్రి 12 గంటలయ్యేదని.. ఈ జాతరలో 10 గంటలకే సారలమ్మను గద్దెలపైకి చేర్చమన్నారు. సమ్మక్క గద్దెల పైకి చేరుకునేలోపు.. ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చే.. అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.

పొరుగు రాష్ట్రాల భక్తులు కూడా వస్తున్నారని మంత్రి వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధులు రానున్నారని వారికి అతిథ్యానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 18వ తేదీ అమ్మవారి దర్శనానికి కేసీఆర్ ఉదయం 11 గంటలకు రానున్నట్టు ఎర్రబెల్లి తెలిపారు. సాయంత్రం 3 గంటల వరకు జాతరలోనే ఉంటారని వెల్లడించారు.

టాపిక్