తెలుగు న్యూస్  /  Telangana  /  Man Sentenced To 20 Year Imprisonment For Sexually Assaulting Minor

imprisonment: చిన్నారిపై లైంగిక వేధింపులు.. 20 ఏళ్ల శిక్ష విధించిన పోక్సో కోర్టు

HT Telugu Desk HT Telugu

25 November 2022, 10:20 IST

    • చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ వ్యక్తికి పోక్సో ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తికి 20 ఏళ్ల జైలు
చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తికి 20 ఏళ్ల జైలు (HT_PRINT)

చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తికి 20 ఏళ్ల జైలు

హైదరాబాద్: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి లైంగిక నేరాల నుంచి పిల్లల ప్రత్యేక రక్షణ చట్టం (పోక్సో) కోర్టు గురువారం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

ట్రెండింగ్ వార్తలు

2 may 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

Erravalli Farmers: వరి వెదసాగు పద్ధతితో సిరులు పండిస్తున్న ఎర్రవల్లి రైతులు, వెదజల్లే పద్ధతిలో అధిక దిగుబడులు..

Jagtial Crime : జగిత్యాలలో దారుణం, కోడలి మెడ నరికి హత్య చేసిన మామ

Warangal Kidnap : వరంగల్ లో వడ్డీ వ్యాపారి దారుణం, అప్పు తీసుకున్న వ్యక్తి కిడ్నాప్-రూ.28 లక్షలకు బలవంతపు సంతకాలు

నిందితుడిని మంచాల్‌కు చెందిన దుసరి రాజు అలియాస్ కాటం రాజును ఈ కేసులో దోషిగా గుర్తించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి హరీష అతనికి రూ.20 వేల జరిమానా కూడా విధించారు.

మంచాల్ పోలీసులు ఫిబ్రవరి 5, 2016న ఓ తండ్రి నుండి ఫిర్యాదును స్వీకరించారు. కాటం రాజు తన 4 ఏళ్ల కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 3న చిన్నారి ఆడుకుంటుండగా కాటం రాజు ఆ చిన్నారికి డబ్బులు ఇస్తానని చెప్పి సమీపంలోని ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

మళ్లీ ఫిబ్రవరి 4న నిందితుడు మరోసారి డబ్బు ఇస్తానని ఆ చిన్నారిని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించాడని, అయితే ఆ బాలిక అతడి నుంచి పారిపోయి జరిగిన మొత్తం విషయాన్ని తన తల్లికి చెప్పిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదు మేరకు మంచాల్ పీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

విచారణ అనంతరం మరో పోలీసు అధికారి ఎం.గంగాధర్‌ చార్జిషీట్‌ దాఖలు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసును విచారించిన ఎల్‌బీ నగర్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు నిందితుడు దూసరి రాజుకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 20 వేల జరిమానా విధించింది.