తెలుగు న్యూస్  /  Telangana  /  Ktr Announced Compensation Of 10 Lakhs For Khammam Blast Victims

ktr Condolense: ఖమ్మం పేలుడు బాధితులకు కేటీఆర్ పరామర్శ..పదిలక్షల పరిహారం

HT Telugu Desk HT Telugu

13 April 2023, 12:41 IST

    • ktr Condolense: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన బిఆర్‌ఎస్‌ ఆత్మీయ సమావేశంలో గాయపడిన వారిని మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో మరణించిన ఒక్కొక్కరికి పదిలక్షల పరిహారం ప్రకటించారు. 
ఖమ్మంలో పేలుడుకు కారణమైన గుడిసె చుట్టూ గుమిగూడినజనం
ఖమ్మంలో పేలుడుకు కారణమైన గుడిసె చుట్టూ గుమిగూడినజనం

ఖమ్మంలో పేలుడుకు కారణమైన గుడిసె చుట్టూ గుమిగూడినజనం

ktr Condolense: చీమలపాడు పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన మంత్రి..వైద్యుల బృందంతో మాట్లాడి క్షతగాత్రులకు ఏ విధంగా వైద్య సేవలు అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Erravalli Farmers: వరి వెదసాగు పద్ధతితో సిరులు పండిస్తున్న ఎర్రవల్లి రైతులు, వెదజల్లే పద్ధతిలో అధిక దిగుబడులు..

Jagtial Crime : జగిత్యాలలో దారుణం, కోడలి మెడ నరికి హత్య చేసిన మామ

Warangal Kidnap : వరంగల్ లో వడ్డీ వ్యాపారి దారుణం, అప్పు తీసుకున్న వ్యక్తి కిడ్నాప్-రూ.28 లక్షలకు బలవంతపు సంతకాలు

TS ICET 2024 Updates : తెలంగాణ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు, మే 7 వరకు ఛాన్స్

చీమలపాడు గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు బాధితులను బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. సిలిండర్‌ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులను హైదరాబాద్‌లోని నిమ్స్‌ కు (NIMS) తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

గురువారం ఉదయం మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి నిమ్స్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్‌.. బాధితులను పరామర్శించారు. నలుగురి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని వైద్యులకు సూచించారు.

బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో బిఆర్‌ఎస్‌ కార్యకర్తలు టపాసులు కాల్చడంతో నిప్పురవ్వలు గుడిసెపై పడి మంటలు రేగాయి.వాటిని ఆర్పే క్రమంలో సిలిండర్ పేలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు బకెట్లతో నీళ్లు తీసుకువచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తూ.. గ్రామానికి చెందిన వాటర్ ట్యాంకర్‌‌‌‌ను తెప్పించారు. గుడిసె లోపల ఉన్న సిలిండర్‌‌ను గమనించకపోవడంతో మంటలు పెరిగి లోపల ఉన్న గ్యాస్​ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది.

ఆ ధాటికి మంటలు ఆర్పుతున్న వారి కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. పది మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే పోలీస్ వాహనాల్లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారిలో ఒకరికి రెండు కాళ్లు, మరో ముగ్గురికి ఒక్కో కాలు చొప్పున డాక్టర్లు తొలగించారు. ముగ్గురిని హైదరాబాద్​కు తరలించి నిమ్స్​లో చికిత్స అందిస్తున్నారు.

బాధితుల్ని పరామర‌్శించిన తర్వాత చీమలపాడు ఘటన దురదృష్టకరమని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ప్రమాదంలో కుట్ర కోణం ఉందో.. లేదో దర్యాప్తులో తేలుతుందన్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైదులను కోరినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామన్నారు.

విచారం వ్యక్తం చేసిన సిఎం కేసీఆర్

ఈ సంఘటనపై సీఎం కేసీఆర్‌ తీవ్ర ది గ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కి, చీమలపాడులో ఉన్న ఎంపీ నామా నాగేశ్వర్‌రావుకు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కు టుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని, అం డగా ఉంటామని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. దీంతోపాటు నామా ముత్తయ్య ట్రస్ట్‌ ద్వారా మృతుల కుటుంబాలకు మరో రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రకటించా రు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున సాయం అందిస్తానని ఎమ్మెల్యే రాములునాయక్‌ తెలిపారు.

ప్రమాదంలో గ్రామానికి చెందిన 5వ వార్డు సభ్యుడు ఆజ్మీరా మంగు, నరాటి వెంకన్న, స్టేషన్‌ చీమలపాడుకు చెందిన బానోత్‌ రమేశ్‌ , తవిసిబోడుకు చెందిన తేజావత్‌ భాస్కర్‌, వెంకిట్యాతండాకు చెందిన ఆంగోత్‌ కుమార్‌, గేట్‌ రేలకాయలపల్లికి చెందిన ధరంసోత్‌ లక్ష్మణ్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ నవీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

గేట్‌ కారేపల్లికి చెందిన తేళ్ల శ్రీనివాసరావు, ఇల్లెందు పట్టణానికి చెందిన బండి రా మారావుకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికుల సాయంతో క్షతగాత్రులను నాలుగు పోలీస్‌ వాహనాల్లో ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆజ్మీరా మంగు, బానోత్‌ రమేశ్‌, ధరంసోత్‌ లక్ష్మణ్‌ మృతిచెందారు.