తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Tourism Announced Tirumala Tour Package From Hyderabad City

IRCTC Hyd Tirumala Tour: గుడ్ న్యూస్.. రూ. 4 వేల బడ్జెట్‌లో తిరుమల టూర్

HT Telugu Desk HT Telugu

26 November 2022, 16:33 IST

    • IRCTC Tirumala Tour Package : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి తిరుచానూర్, తిరుమల వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు వివరాలను ప్రకటించింది.
హైదరాబాద్ తిరుమల టూర్,
హైదరాబాద్ తిరుమల టూర్, (irctc)

హైదరాబాద్ తిరుమల టూర్,

IRCTC Tirumala Tour Package : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుపతి వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు వివరాలను ప్రకటించింది. 'GOVINDAM' పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. రైలు మార్గంలో వెళ్లొచ్చు. తిరుమల, తిరుచానూర్ ఆలయాలను దర్శించుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

TS DOST Notification 2024 : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

Padmasri Awardee Mogulaiah: దినసరి కూలీగా పద్మశ్రీ పురస్కార గ్రహీత మొగలయ్య, గౌరవ వేతనం ఆగడంతో కష్టాలు

3 may 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ డిసెంబర్ 4వ తేదీన అందుబాటులో ఉంది. ట్రైన్ జర్నీలో భాగంగా... ఈ టూర్ లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం అవుతుంది. అయితే సికింద్రాబాద్, నల్గొండ స్టేషన్లలోనూ స్టాప్ ఇచ్చారు.

Day 1 : లింగంపల్లి(Lingampally) నుండి సాయంత్రం 05:25 గంటలకు రైలు బయలుదేరుతుంది. సికింద్రాబాద్ 06:10 గంటలకు చేరుకుంటుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.

Day 2 : తిరుపతి(Tirupati)కి ఉదయం 05:55 గంటలకు చేరుకుంటారు. పికప్ చేసుకుని.. హోటల్‌కి తీసుకెళ్తారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత... ఉదయం 8 గంటల సమయంలో శ్రీవారి స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంటుంది. అనంతరం హోటల్ కు చేరుకొని లంచ్ చేస్తారు. ఆ తర్వాత తిరుచానూరు ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక సాయంత్రం 06. 25 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.

Day 3: ఉదయం 03:04 గంటలకు నల్గొండ, 05:35 సికింద్రాబాద్ స్టేషన్, 06:55 నిమిషాలకు లింగంపల్లి స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ధరల వివరాలు....

ఐఆర్‌సీటీసీ గోవిందం టూర్ ప్యాకేజీలో వేర్వురు ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 4510, డబుల్ ఆక్యూపెన్సీ రూ. 3770, ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర రూ.3690గా నిర్ణయించారు. కంఫర్ట్ క్లాసులోని ధరలతో పాటు చిన్నపిల్లలకు నిర్ణయించిన రేట్లు కింద ఇచ్చిన జాబితాలో చూడవచ్చు.

ధరల వివరాల పట్టిక

NOTE:

ఈ టూర్ బుకింగ్ చేసుకోవటంతో పాటు ఇతర టూర్ ప్యాకేజీలను తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.