తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Kerala Tour: కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఇదిగో Irctc తాజా ప్యాకేజీ..

IRCTC Kerala Tour: కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఇదిగో IRCTC తాజా ప్యాకేజీ..

HT Telugu Desk HT Telugu

22 December 2022, 9:24 IST

    • IRCTC Hyderabad - Kerala Tour: కేరళ ట్రిప్ వెళ్లే వారికోసం ఐఆర్‌సీటీసీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. మీకోసం సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
హైదరాబాద్ - కేరళ టూర్
హైదరాబాద్ - కేరళ టూర్ (KeralaTourism)

హైదరాబాద్ - కేరళ టూర్

IRCTC Tourism Kerala Tour Package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి కేరళలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'KERALA HILLS & WATERS' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో అలెప్పీ, మున్నార్ తో పాటు పలు టూరిజం స్పాట్ లు కవర్ అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

Siddipet Accident : పెళ్లి రోజే విషాదం, రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Youth Cheated Producer : ఒక్క ఛాన్స్ అంటూ నిర్మాత చుట్టూ ప్రదక్షిణాలు, అవకాశం చిక్కగానే బంగారంతో జంప్

Cyber Crime : ప్రముఖ కంపెనీలో ఉద్యోగం, సిద్దిపేట యువతికి రూ.16 లక్షలు టోకరా - ఏపీలో సైబర్ కేటుగాడు అరెస్ట్

Mlc Dande Vithal : ఎమ్మెల్సీగా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు, సుప్రీంలో సవాల్ చేస్తానంటోన్న దండే విఠల్

hyderabad - kerala tour: ప్రస్తుతం ఈ టూర్ జనవరి 17వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

Day 01 Tuesday: మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి టూర్ ప్రారంభమవుతుంది. Train No.17230, Sabari Express రైలు ఎక్కుతారు. రాత్రి జర్నీ ఉంటుంది.

Day 02 Wednesday: రెండో రోజు మధ్యాహ్నం 12.55 గంటలకు ఎర్నాకులం రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ లోని హెటల్ కి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి మున్నార్ లోనే బస చేస్తారు.

Day 03 Thursday: ఉదయం ఎరవికులం జాతీయ పార్క్ ను సందర్శిస్తారు. మెట్టుపెట్టి డ్యామ్, ఏకో పాయింట్ కు వెళ్తారు. రాత్రి కూడా మున్నార్ లోనే ఉంటారు.

Day 04 Friday: నాల్గొరోజు అల్లెప్పీకి వస్తారు. బ్యాక్ వాటర్ అందాలను అస్వాదించవచ్చు. రాత్రి అల్లెప్పీలోనే ఉంటారు.

Day 05 Saturday: ఐదో రోజు హెటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. అక్కడ్నుంచి ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. ఉదయం 11.20 గంటలకు శబరి ఎక్సె ప్రెస్ లో హైదరాబాద్ కు బయల్దేరుతారు.

Day 06 Sunday: మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ధర ఎంతంటే..?

hyd kerala tour cost: కంఫర్ట్ (3ఏ) క్లాస్ సింగిల్ షేరింగ్ కు రూ. 31,430 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 18,190 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.14,800 గా ఉంది. స్టాండర్డ్ క్లాస్ లో వేర్వురు ధరలు ఉన్నాయి. ఇక 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు కూడా వేర్వురు ధరలు ఉంటాయి. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

ధరల వివరాలు

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.