తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Gold Price Today : తగ్గిన బంగారం ధరలు.. మీ నగరంలో తాజా రేట్లు ఇవే

Gold Price Today : తగ్గిన బంగారం ధరలు.. మీ నగరంలో తాజా రేట్లు ఇవే

Anand Sai HT Telugu

15 September 2022, 6:55 IST

    • Gold and Silver Price today 15th september 2022: కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. అయితే వరుసగా బుధవారం, గురువారం ధరలు తగ్గాయి. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.46,400 నమోదైంది. మరోవైపు వెండి రేటు సైతం ఇవాళ తగ్గింది.
తగ్గిన బంగారం ధరలు
తగ్గిన బంగారం ధరలు

తగ్గిన బంగారం ధరలు

Gold silver price today 15th september 2022: బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి. గురువారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారంపై రూ.330 తగ్గగా.. 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంపై రూ. 360 తగ్గింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,620గా నమోదైంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Rythu Bharosa Funds : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, రైతు భరోసా నిధులు విడుదల

Plantix App: మూడు కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్న ప్లాంటిక్స్ యాప్… రైతుల మన్నన పొందుతున్న అప్లికేషన్

Mlc Kavitha Bail Petitions : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, బెయిల్ నిరాకరించిన కోర్టు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,400 వద్ద కొనసాగుతోంది. ఇవాళ వెండిపై రూ. 600 తగ్గి...హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.61,800గా ఉంది

Gold silver price: ఏపీలో ఇలా…

gold silver prices in ap: విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.46,400గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 50,620గా నమోదైంది. ఇక్కడ వెండి ధర కిలో రూ. 61,800 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620గా ఉంది.

Gold silver price: పలు నగరాల్లో ఇలా..

gold and silver rate in india: దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,010గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280గా ఉంది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,550గా ఉంటే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,780 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,450గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,680 వద్ద ఉంది. కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 50,620గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,400 వద్ద కొనసాగుతోంది.

Platinum Price today: ప్లాటినం ధరలు ఇలా..

ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 400 చొప్పున తగ్గింది. హైదరాబాద్‌లో ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 22,560గా ఉంది. విజయవాడలో, విశాఖపట్నంలోనూ ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 22,560గా ఉంది.

ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉన్నాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనే రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి.