తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp Tamilsai: కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ గవర్నర్ తమిళసై..

BJP TamilSai: కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ గవర్నర్ తమిళసై..

Sarath chandra.B HT Telugu

20 March 2024, 13:31 IST

    • BJP TamilSai: తెలంగాణ మాజీ గవర్నర్‌ బీజేపీలో చేరారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. 
బీజేపీలో చేరిన మాజీ గవర్నర్ తమిళసై
బీజేపీలో చేరిన మాజీ గవర్నర్ తమిళసై

బీజేపీలో చేరిన మాజీ గవర్నర్ తమిళసై

BJP TamilSai: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సై బీజేపీలో చేరారు. తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొనాలని భావిస్తున్న తమిళసై సోమవారం పదవికి రాజీనామా చేశారు. తమిళసై రాజీనామాను రాష్ట్రపతి అదే రోజు అమోదించారు. బుధవారం కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి Kishan reddyసమక్షంలో తమిళ సై బీజేపీ కండువా కప్పుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ 7వ ఛార్జీషీట్ - నిందితురాలిగా కవిత పేరు..!

Yadagirigutta Tour : ఒకే ఒక్క రోజులో యాదాద్రి ట్రిప్ - కొలనుపాక జైన్ మందిర్ కూడా చూడొచ్చు, 1499కే టూర్ ప్యాకేజీ

TSMS Inter Admissions 2024 : తెలంగాణ మోడల్ స్కూల్ 'ఇంటర్' ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలివే

Hyderabad Crime News : సాఫ్ట్ వేర్ ఉద్యోగం పేరుతో ఎర..! ఇంటర్వూ కోసం వచ్చిన యువతిపై అత్యాచారయత్నం..!

తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన Governor తమిళిసై సౌందరరాజన్ తిరిగి తమిళనాడులో భారతీయ జనతా పార్టీలో చేరారు.

చెన్నైలోని BJP పార్టీ ప్రధాన కార్యాలయం 'కమలాలయం' Kamlalayamలో సౌందరరాజన్‌కు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై సభ్యత్వ కార్డును అందజేశారు.

ఈ సందర్భంగా తమిళిసై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడుతూ.. పదవి నుంచి వైదొలగడం కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ తిరిగి పార్టీ కోసం పనిచేయడం సంతోషంగా ఉందన్నారు.

గతంలో 'వానతి శ్రీనివాసన్ పార్టీ కార్యాలయంలో కూర్చునేవారని, రాజకీయాల్లో విజయవంతమైన మహిళకు ఆమె ఒక ఉదాహరణ అని చెప్పారు.తనకు ఇది అత్యంత సంతోషకరమైన రోజు అని, తీసుకున్నది Hard Decision కఠినమైన నిర్ణయమన్నారు.

గవర్నర్‌గా  ఎన్నో సౌకర్యాలు ఉండేవని, గవర్నర్ పదవిని వదులకుని, రాజకీయాల్లోకి వచ్చినందుకు తాను  ఒక్క శాతం కూడా చింతించడం లేదని చెప్పారు. గవర్నర్‌గా పనిచేసిన సమయంలో  తెలంగాణలో ఎన్నో సవాళ్లను చూశానన్నారు. తాను గవర్నర్‌గా పనిచేసిన సమయంలో నలుగురు ముఖ్యమంత్రులను చూశానని చెప్పారు.

తమిళనాడులో కమలం వికసించటం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె.అన్నామలై మాట్లాడుతూ రాష్ట్రానికి తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతోనే తమిళిసై తన పదవికి రాజీనామా చేశారని చెప్పారు.

తమిళసై తీసుకున్న నిర్ణయం అంత సులువైనది కాదన్నారు. ఎన్డీయే 400కు పైగా సీట్లు గెలుచుకోబోతోందని, తమిళిసై రాజకీయాల్లో ఉండి బీజేపీకి సహకరించాలని అనుకుంటున్నారని చెప్పారు.గవర్నర్‌ పదవికి రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించడంతో ఆమె మళ్లీ బీజేపీ క్యాడర్ లో చేరారని చెప్పారు.

తమిళ ప్రజలను, బీజేపీ పార్టీని ఎంతగా ప్రేమిస్తుందో దీన్ని బట్టి అర్థం అవుతోందని చెప్పారు. పొత్తులు, సీట్ల పంపకాల కోసం కిషన్ రెడ్డి ఐదు రోజులుగా చెన్నైలోనే ఉన్నారు. తమిళసైకు ఎంతో పరిపాలనా అనుభవం ఉందని చెప్పారు. ఆమెను తిరిగి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు.

సౌందరరాజన్ రాజీనామాను అధ్యక్షుడు ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదించారు. ఆమె రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ను తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు అప్పగించారు.