తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ts Governor Tamilsai: తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళ సై, ఎంపీగా పోటీ చేయనుండటమే కారణం….

TS Governor Tamilsai: తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళ సై, ఎంపీగా పోటీ చేయనుండటమే కారణం….

Sarath chandra.B HT Telugu

18 March 2024, 11:32 IST

    • TS Governor Tamilsai: సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను రాష్ట్రపతికి పంపారు. 
తెలంగాణ, పుదుచ్చేరి  గవర్నర్‌ పదవులకు రాజీనామా చేసిన తమిళ సై
తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌ పదవులకు రాజీనామా చేసిన తమిళ సై

తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌ పదవులకు రాజీనామా చేసిన తమిళ సై

TS Governor Tamilsai తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్‌ పదవికి రాజీనామా Resignatiopn చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రెండో Governor గవర్నర్‌గా నియమితురాలైన తమిళ సై Tamil sai ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించే లక్ష్యంతో పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి president పంపించారు.

ట్రెండింగ్ వార్తలు

CM Revanth Campaign : అలా జరిగితే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుంది - పాతబస్తీ ప్రజలకు రేవంత్ ప్రత్యేక విజ్ఞప్తి

EC Notice to CM Revanth : సీఎం రేవంత్‌ రెడ్డికి ఈసీ నోటీసులు

EC Final Order: మేలో నిధులు విడుదల చేసిన చరిత్ర ఏపీలో లేదు, పోలింగ్ ముందు డిబిటి కుదరదని తేల్చిన ఈసీ

Modi in Mahabubnagar : నేను ఎవరి పేరు చెప్పలేదు, కానీ రేవంత్ రెడ్డి భుజాలను తడుముకుంటున్నారు - మోదీ

గత కొద్ది రోజులుగా తమిళ సై Lok sabha ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడు తున్నాయి. ఈ వార్తల్ని నిజం చేస్తూ సోమవారం తన రాజీనామా లేఖను రాష్ట్రపతి అమోదం కోసం పంపించారు. తమిళనాడులోని చెన్నై సెంట్రల్ Chennai central పార్లమెంటు నియోజక వర్గం నుంచి ఆమె ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. తమిళ సై పోటీకి బీజేపీ అధినాయకత్వం అమోదం తెలపడంతో రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు.

తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్రానికి రెండవ గవర్నర్‌గా నియమితులయ్యారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పలుమార్లు విభేదాలు తలెత్తాయి. గవర్నర్‌ను ప్రభుత్వం గౌరవించడం లేదని పలుమార్లు ఆరోపించారు. ప్రభుత్వం పంపిన బిల్లుల్ని వెనక్కి తిప్పి పంపడం, పెండింగ్‌లో ఉంచడం ద్వారా వార్తల్లోకి వచ్చారు. ఈ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది.

తమిళనాడుకు చెందిన తమిళ సై వృత్తిరీత్యా వైద్యురాలిగా పనిచేశారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ గా నియమించారు. 2019 సెప్టెంబర్ 8న గవర్నర్‌గా భాద్యతలు చేపట్టారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌కు పుదుచ్చేరి Puduchhery గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఫిబ్రవరి 2021లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా 18 ఫిబ్రవరి 2021న భాద్యతలు చేపట్టారు.

తమిళ సై ఎంబీబీఎస్ విద్యను చెన్నైలోని మద్రాస్ మెడికల్ విశ్వవిద్యాలయంలో, పీజీలో ప్రసూతి, గైనకాలజీ విద్యను డాక్టర్ ఎంజిఆర్ మెడికల్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. సోనాలజీ, ఎఫ్.ఈ.టీ థెరపీలో ఉన్నత విద్యను కెనడాలో పూర్తి చేశారు.

తమిళ సైకు చిన్నతనం నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉంది. ఎంబీబీఎస్ విద్యను మద్రాస్ వైద్య కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే విద్యార్థి సంఘం నాయకురాలిగా పనిచేశారు. బీజేపీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులై ఆ పార్టీలో చేరింది. 1999లో దక్షిణ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 2001 లో తమిళనాడు రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా, 2007 లో అఖిల భారత కో-కన్వీనర్ గా, 2007 లో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 2010లో తమిళనాడు రాష్ట్ర భారతీయ పార్టీ ఉపాధ్యక్షురాలిగా, 2013 లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2014వ సంవత్సరం నుంచి తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగారు.

2006, 2011 లో రెండుసార్లు శాసనసభ సభ్యురాలిగా పోటీ చేశారు. 2009, 2019 లో రెండుసార్లు లోక్ సభ సభ్యురాలిగా పోటీచేసి ఓడిపోయారు. 2024లో చెన్నై సెంట్రల్, తుత్తుకూడి నియోజక వర్గాల నుంచి లోక్‌సభకు పోటీ చేసే అవకాశాలున్నాయి. తమిళసై భర్త సౌందరరాజన్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే అకాంక్షతో ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.

తదుపరి వ్యాసం