MLC Kavitha: తమిళసైకి కవిత కౌంటర్.. గవర్నర్ తీరు రాజ్యాంగ విరుద్ధం-mlc kalvakuntla kavitha on governor tamilsai ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mlc Kavitha: తమిళసైకి కవిత కౌంటర్.. గవర్నర్ తీరు రాజ్యాంగ విరుద్ధం

MLC Kavitha: తమిళసైకి కవిత కౌంటర్.. గవర్నర్ తీరు రాజ్యాంగ విరుద్ధం

Published Sep 26, 2023 01:29 PM IST Muvva Krishnama Naidu
Published Sep 26, 2023 01:29 PM IST

  • గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీల ఫైల్ తిరస్కరణపై బీఆరెఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్‌ తమిళిసై వ్యవహరించారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్రాల్లో భారత రాజ్యాంగం నడుస్తుందా లేదా బీజేపీ రాజ్యాంగం నడుస్తున్నదా అని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు అసెంబ్లీ హాలులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. బీసీ వర్గాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దపీట వేస్తున్నదని కవిత చెప్పారు. తమది బీసీ వ్యతిరేక పార్టీ అని బీజేపీ మరోసారి నిరూపించుకున్నదని వెల్లడించారు. కాగా ఉద్యమకారులు దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణలను గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ ప్రభుత్వం పంపిన ఫైలును గవర్నర్‌ తిరస్కరించిన విషయం తెలిసిందే.

More