తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ed It Raids: నిన్న మంత్రి… ఇవాళ Trs ఎంపీ ఆఫీసులో ఈడీ సోదాలు

ED IT Raids: నిన్న మంత్రి… ఇవాళ TRS ఎంపీ ఆఫీసులో ఈడీ సోదాలు

HT Telugu Desk HT Telugu

10 November 2022, 11:12 IST

    • ED IT Raids in Telangana: బుధవారం మంత్రి గంగుల కమలాకర్ నివాసంతో పాటు ఆఫీసులో సోదాలు చేపట్టిన ఈడీ… ఇవాళ టీఆర్ఎస్  ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆఫీసులో సోదాలు చేపట్టింది. 
టీఆర్ఎస్ ఎంపీ నివాసంలో సోదాలు
టీఆర్ఎస్ ఎంపీ నివాసంలో సోదాలు

టీఆర్ఎస్ ఎంపీ నివాసంలో సోదాలు

ED Raids in Telangana: తెలంగాణలో ఐటీ, ఈడీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. బుధవారం ఉదయమే హైదరాబాద్, కరీంనగర్ లో అధికారులు తనిఖీలు చేపట్టారు. మంత్రి గంగుల కమలాకర్, కొంతమంది గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. తాజాగా అధికార టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాసం ఈడీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని ఆయన కార్యాలయంలో ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు చేస్తోంది. గ్రానైట్ వ్యాపారాలతో ఎంపీ రవిచంద్రకు సంబంధమున్న నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

Mlc Dande Vithal : ఎమ్మెల్సీగా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు, సుప్రీంలో సవాల్ చేస్తానంటోన్న దండే విఠల్

Koheda Gutta ORR : ఓఆర్ఆర్ పక్కనే ఉన్న కోహెడ గుట్టను చూసొద్దామా..! వ్యూపాయింట్ అస్సలు మిస్ కావొద్దు

Rohith Vemula Case : రోహిత్ వేముల దళితుడు కాదు..! హైకోర్టులో కేసు క్లోజ్ రిపోర్ట్ దాఖలు

Guinness World Record : కేవలం 2.88 సెకన్లలోనే 'Z నుంచి A' వరకు టైపింగ్ - గిన్నిస్‌ రికార్డు సాధించిన హైదరాబాదీ

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ అధికారులు బుధవారం జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. హైదరాబాద్ తో పాటు కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు జరిపారు. గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలే లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి మొత్తం 30 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరుపుతున్నట్లు తెలిసి వచ్చింది. ఇందులో 20కి పైగా ఈడీ, ఐటీ బృందాలు పాల్గొన్నాయి. పంజాగుట్ట, ఉప్పరపల్లి, పంజాగుట్టలోని పి.ఎస్.ఆర్. గ్రానైట్స్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు అధికారులు. గ్రానైట్ నిర్వాహకులు ఫెమా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.

స్పందించిన గంగుల..

ఈడీ, ఐటీ సోదాల విషయంలో దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తానని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు.సోదాల్లో ఎంత నగదు దొరికిందో, ఏమేం స్వాధీనం చేసుకున్నారో ఈడీ అధికారులు చెప్పాలన్నారు. సోదాలపై సమాచారం అందటంతో దుబాయ్ నుంచి వచ్చినట్లు వెల్లడించారు.

మరోవైపు గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈడీ, ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులోనూ ఈడీ దూకుడుగా ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ కాగా... పలువురికి నోటీసులు అందజేసింది.