IT and ED Raids : మంత్రి గంగుల ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు
తెలంగాణలో ఐటీ, ఈడీ తనిఖీలు కలకలం రేపాయి. హైదరాబాద్, కరీంనగర్ లో అధికారులు తనిఖీలు చేపట్టారు. మంత్రి గంగుల కమలాకర్, కొంతమంది గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి.
తెలంగాణ(Telangana)లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ తోపాటుగా కరీంనగర్ లోనూ ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. మంత్రి గంగుల(Minister Gangula Kamalakar), పలువురు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లపై అధికారులు దాడి చేశారు. వారి ఇళ్లు, కారలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. పంజాగుట్టలోని పీఎస్‌ఆర్ గ్రానైట్స్, హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్లలో తనిఖీలు చేపట్టారు. సోమాజీగూడలో గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ నివాసంలో సోదాలు చేశారు.
కరీంనగర్‌లో గంగుల కమలాకర్ ఇంట్లో సోదాలు జరిగాయి. అంతేగాకుండా ఆయనకు చెందిన మంకమ్మతోట(Mankammathota) శ్వేత గ్రానైట్, కమాన్ దగ్గర మహవీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్‌లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు జరుగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారి అరవింద్‌వ్యాస్, ఇంకొంతమంది ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఈ మెుత్యం వ్యవహారంలో గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలోనే ఈడీ నోటీసులు ఇచ్చినట్టుగా సమాచారం. గ్రానైట్ పరిశ్రమల పత్రాలను పరిశీలిన చేస్తున్నారు. సమారు 20 మంది వరకు అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
కరీంనగర్(Karimnagar)లో తెల్లవారి నుంచి 10 చోట్ల సోదాలు చేస్తున్నారు. బావుపేట, కొత్తపల్లి, కామన్ చౌరస్తా వద్ద అరవింద్ గ్రానైట్ యజమాని ఇంట్లోనూ తనిఖీలు నడుస్తు్న్నాయి. గతంలో కరీంనగర్ నుండి కాకినాడకు గ్రానైట్ ను తరలించగా.. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని ఫిర్యాదు అందింది. ఉమ్మడి జిల్లాలో పన్ను కట్టకుండా గ్రానైట్ తరలిస్తున్నారనే ఫిర్యాదులు కూడా అందడం సోదాలకు కారణంగా తెలుస్తోంది. అనుమతికి మించి తవ్వకాలు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం.
ఖమ్మం(Khammam)లో కూడా ఐటీ, ఈడీ అధికారులు సోదాలు జరుగుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులపై ఆదాయపుపన్ను శాఖ దాడులు చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఆసుపత్రుల్లోని కంప్యూటర్లు, ఇతర ఫైల్స్ స్వాధీనం చేసుకుని సోదాలు చేస్తు్న్నారు. భారీగా లావాదేవిలు నిర్వహించినట్లు సమాచారం అందుకున్న అధికారులు ఈ మేరకు దాడులకు దిగినట్లుగా సమాచారం. లావాదేవీలపై దర్యాప్తు జరుగుతోంది.
సంబంధిత కథనం