ED raids in excise policy case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మళ్లీ ఈడీ దాడులు-ed raids across delhi in excise policy case report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ed Raids Across Delhi In Excise Policy Case: Report

ED raids in excise policy case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మళ్లీ ఈడీ దాడులు

HT Telugu Desk HT Telugu
Oct 14, 2022 03:30 PM IST

ED raids in excise policy case: లిక్కర్ పాలసీ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. తాజాగా, శుక్రవారం ఢిల్లీలో 25 చోట్ల సోదాలు నిర్వహించింది.

ఢిల్లీలో శుక్రవారం ఈడీ దాడుల దృశ్యం
ఢిల్లీలో శుక్రవారం ఈడీ దాడుల దృశ్యం

ED raids in excise policy case: ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ విధానం కుంభకోణంలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ పై కక్ష సాధింపులో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం మరోసారి ఢిల్లీలో ఈడీ సోదాలు నిర్వహించింది.

ED raids in excise policy case: 25 చోట్ల సోదాలు..

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కు సంబంధించి శుక్రవారం ఈడీ ఢిల్లీలోని 25 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. 2021-22 ఎక్సైజ్ పాలసీపై పలు ఆరోపణలు రావడంతో ఈ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం గతంలోనే రద్దు చేసింది. ఈ పాలసీలో జరిగిన అవకతవకలపై ఈడీతో పాటు సీబీఐ కూడా విచారణ జరుపుతోంది. ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా సిఫారసుల మేరకు సీబీఐ ఈ కేసు చేపట్టింది.

ED raids in excise policy case: గతవారం కూడా..

గత వారం కూడా ఈ కేసులో ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, ఢిల్లీ, పంజాబ్ ల్లోని 35 లొకేషన్లపై దాడులు చేసింది. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసిన సమీర్ మహేంద్రు ఇచ్చిన కీలక సమాచారంతో ఈడీ తాజా దాడులు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా నిందితుడిగా ఉన్నారు. దీనిపై ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. గత మూడు నెలలుగా 300 మంది అధికారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నా.. మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా ఏ ఒక్క ఆధారాన్ని గుర్తించలేకపోయారని ఆయన విమర్శించారు. ‘వారికి ఏమీ దొరకదు.. ఎందుకంటే మేం ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి’ అని ఆయన ట్వీట్ చేశారు.

IPL_Entry_Point