తెలుగు న్యూస్  /  Telangana  /  Case Filed Against Ys Sharmila

YS Sharmila : వైఎస్‌ షర్మిలపై కేసు.. విజయమ్మను అడ్డుకున్న పోలీసులు

HT Telugu Desk HT Telugu

29 November 2022, 16:19 IST

    • YS Sharmila Protest : వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై మూడు కేసులు నమోదయ్యాయి. మరోవైపు వైఎస్ విజయమ్మను ఇంటివద్దే పోలీసులు అడ్డుకున్నారు.
షర్మిలపై కేసు నమోదు
షర్మిలపై కేసు నమోదు

షర్మిలపై కేసు నమోదు

వైఎస్ఆర్టీపీ(YSRTP) అధ్యక్షురాలు షర్మిల ప్రగతి భవన్ ముట్టడి ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్(Warangal) జిల్లా నర్సంపేటలో ధ్వంసమైన కారులో ఆమె ప్రగతి భవన్ బయలుదేరి నిరసన తెలపాలనుకున్నారు. కారుతోపాటుగా ధ్వంసమైన కార్ వాన్ కూడా తీసుకొచ్చారు. దీంతో పోలీసులు ఆమెను పంజాగుట్ట(Panjagutta) వద్ద అడ్డుకున్నారు. అదే సమయంలో వైఎస్ షర్మిల(YS Sharmila) కారులోనే ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Jagtial Crime : జగిత్యాలలో దారుణం, కోడలి మెడ నరికి హత్య చేసిన మామ

Warangal Kidnap : వరంగల్ లో వడ్డీ వ్యాపారి దారుణం, అప్పు తీసుకున్న వ్యక్తి కిడ్నాప్-రూ.28 లక్షలకు బలవంతపు సంతకాలు

TS ICET 2024 Updates : తెలంగాణ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు, మే 7 వరకు ఛాన్స్

Medak Accident: పెళ్లైన మూడు రోజులకే రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం, నవ వధువుకు తీవ్రగాయాలు

కారు అద్దాలు మూసివేసి వైఎస్‌ షర్మిల లోపలే కూర్చొని ఉన్నారు. బయటకు వచ్చేందుకు నిరాకరించారు. షర్మిల కారును క్రేన్‌ ద్వారా లిఫ్ట్‌ చేసి ఎస్సాఆర్ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు(SR Nagar Police Station) తరలించారు. ఆ తర్వాత కారు డోర్లు తెరిచి.. స్టేషన్ లోకి తీసుకెళ్లారు. డ్రైవింగ్ సీట్లో ఆమె ఉండగానే.. క్రేన్ సాయంతో కారును తరలించారు. దీంతో వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితు నెలకొన్నాయి. వైఎస్ షర్మిల ట్రాఫిక్(Traffic) కు అంతరాయం కలిగించారనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమెదు చేశారు. 333, 353,337 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

మరోవైపు కుమార్తె షర్మిల అరెస్టు నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కు వైఎస్ విజయమ్మ(YS Vijayamma) బయలుదేరారు. దీంతో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. విజయమ్మను ఎస్సాఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు రాకుండా ఇంటి వద్దే ఆపేశారు. షర్మిలను అరెస్టు చేయడంపై వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఎస్సాఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా వైఎస్ఆర్టీపీ(YSRTP) కార్యకర్తలు రావడంతో ఉద్రిక్తత నెలకొంది.

పోలీసుల తీరుపై షర్మిల మండిపడ్డారు. పోలీసులు గుండాల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్.. బందిపోట్ల రాష్ట్ర సమితిగా తయారైందని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పోరాడుతున్నానని, తనను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు.

ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లాలో పర్యటన సందర్భంగా షర్మిల స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై విమర్శలు గుప్పించడంతో వివాదం మొదలైంది. పాదయాత్రకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని షర్మిల ఆరోపించారు. నర్సంపేటలో జరిగిన దాడి ప్రభుత్వ ప్రోత్సాహంతోనే జరిగిందని ఆరోపించారు.

షర్మిల వ్యాఖ్యలకు నిరసనగా ఆమె వాహనాలను టీఆర్‌ఎస్‌(TRS) కార్యకర్తలు ధ్వంసం చేశారు. షర్మిల బస చేసే బస్సును దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. నర్సంపేటలో బహిరంగ సభ నిర్వహించకుండానే ఆమె యాత్ర ముగించాల్సి వచ్చింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సోమవారం రాత్రి షర్మిలను హైదరాబాద్(Hyderabad) తరలించారు. దీంతో ఆమె కేసీఆర్‌(KCR) ఎదుట నిరసనకు దిగాలని నిర్ణయించారు. షర్మిలను బుజ్జగించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆమె వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.