తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Biometric Attendance : ఇక విద్యాసంస్థల్లో అందరికీ బయోమెట్రిక్

Biometric Attendance : ఇక విద్యాసంస్థల్లో అందరికీ బయోమెట్రిక్

HT Telugu Desk HT Telugu

12 October 2022, 21:23 IST

    • Biometric Attendance In Education Institutions : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాసంస్థ బయో మెట్రిక్ హాజను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.
బయోమెట్రిక్ విధానం
బయోమెట్రిక్ విధానం (unplash)

బయోమెట్రిక్ విధానం

తెలంగాణ(Telangana)లోని ఉన్నత విద్యా సంస్థల్లో బయో మెట్రిక్ హాజరు అమలు చేయాలని ప్రభుత్వం(Govt) నిర్ణయించింది. కాలేజీలు, యూనివర్సిటీల వరకు అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో బయోమెట్రిక్(Biometric) హాజరును తప్పని సరిచేశారు. బోధన, బోధనేతర సిబ్బందికి, విద్యార్థులకు కూడా బయో మెట్రిక్ హాజరును ఉపయోగించాలి.

ట్రెండింగ్ వార్తలు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ

Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. దీనికి సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. స్కాలర్‌షిప్(Scholarship), ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేసేందుకు హాజరు శాతం తెలుసుకునేందుకు బయోమెట్రిక్ హాజరు(Biometric Attendance) ఉపయోగపడుతుంది. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఆయా విద్యా సంస్థల్లో ఎంత సమయం పనిచేస్తున్నారనేది కూడా ఇకపై రికార్డ్ కానుంది. సెలవులు, ఇతరత్రా విషయాలకు కూడా బయోమెట్రిక్ ఉపయోగపడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

<p>బయోమెట్రిక్ పై జీవో</p>