AP Teachers Attendence: ఇకపై ఫోన్ యాప్‌ హాజరు తప్పనిసరి - సర్క్యులర్‌ జారీ-integrated attendance mobile application the attendance taking of teachers in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Teachers Attendence: ఇకపై ఫోన్ యాప్‌ హాజరు తప్పనిసరి - సర్క్యులర్‌ జారీ

AP Teachers Attendence: ఇకపై ఫోన్ యాప్‌ హాజరు తప్పనిసరి - సర్క్యులర్‌ జారీ

Mahendra Maheshwaram HT Telugu
Aug 31, 2022 08:12 AM IST

ap teachers mobile attendence system: ముఖ ఆధారిత హాజరుపై ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా... ఏపీ విద్యాశాఖ మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు 1 నుంచి తప్పనిసరిగా యాప్‌లో హాజరు వేయాలని స్పష్టం చేసింది.

యాప్‌ ద్వారానే టీచర్ల హాజరు
యాప్‌ ద్వారానే టీచర్ల హాజరు

Mobile app attendance in andhra pradesh: ఉపాధ్యాయులపై హాజరు విధానంపై ఏపీ విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసింది.రాష్ట్రంలోని ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ మినహా అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ ఇంటిగ్రేటెడ్‌ అటెండెన్స్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఫేషియల్‌ రికగ్నిషన్‌ విధానంలో హాజరు నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ విధానం రేపట్నుంచే (సెప్టెంబర్‌ 1) అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఫోన్‌ యాప్‌ ద్వారా మాత్రమే ఉపాధ్యాయులు హాజరును వేయాలని వెల్లడించింది.

వారికి మినహాయింపు…

facial recognition attendance system in ap: విద్యా శాఖ నియంత్రణలో ఉన్న అన్ని కార్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది కూడా ఈ యాప్‌లో హాజరు నమోదు చేయాలని స్పష్టం చేసింది. విద్యా శాఖ నియంత్రణలో ఉన్న అన్ని కార్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది కూడా ఈ యాప్‌లో హాజరు నమోదు చేయాలని స్పష్టం చేసింది.ఏ కార్యాలయాల్లోనూ మాన్యువల్‌ హాజరును నమోదు చేయకూడదని పేర్కొంది. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులకు ప్రత్యేక మినహాయింపు ఉంటుందని.. వారు ప్రత్యేకంగా మాన్యువల్‌ రిజిస్టర్లలో హాజరు నమోదు చేయాలని పేర్కొంది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లేని టీచర్లు, ఉద్యోగులు తమ హాజరును హెడ్మాస్టర్‌ లేదా ఇతర ఉపాధ్యాయుల మొబైల్స్‌ ద్వారా నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఈ నిర్ణయం విద్యాశాఖలోని ప్రతి ఒక్క అధికారికి వర్తిస్తుందని తెలిపింది.

monile app attendence for teachers: నూతన హాజరు విధానం విషయంలో ఉపాధ్యాయులు పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఉదయం అందరూ ఒకేసారి హాజరు వేస్తుంటే సర్వర్‌ సమస్య ఏర్పడుతోందని ప్రస్తావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓపెన్‌ కావడం లేదని చెబుతున్నారు. సొంత సెల్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం వల్ల సమాచారమంతా ప్రభుత్వానికి వెళ్లిపోతోందని, సీపీఎస్‌ ఆందోళనను భగ్నం చేసేందుకు పోలీసులు ఈ యాప్‌ ద్వారానే సమాచారం సేకరిస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. హాజరు పడకపోతే జీతం కట్‌ చేస్తారని, దీన్ని సరిచేసుకునేందుకు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ హాజరు విధానంలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని... ఈ విషయంపై ప్రభుత్వంపై దృష్టిసారించి డివైజ్‌లు ఇస్తే బాగుటుందని అభిప్రాయపడుతున్నారు.

మొత్తంగా గురువారం నుంచి ముఖ హాజరు తప్పనిసరి చేసిన నేపథ్యంలో సర్వర్ సమస్యల విషయంలో ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా? ఉపాధ్యాయుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంటుందా అనే చూడాలి.

IPL_Entry_Point