తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pjtsau Admissions: అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు - నోటిఫికేషన్‌ విడుదల

PJTSAU Admissions: అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు - నోటిఫికేషన్‌ విడుదల

09 June 2023, 14:27 IST

    • Professor Jayashankar Agricultural University:ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 2023-24 సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు ముఖ్య వివరాలను పేర్కొన్నారు.
వ్యవసాయ డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్‌
వ్యవసాయ డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్‌

వ్యవసాయ డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్‌

Professor Jayashankar Agricultural University Admissions: అగ్రికల్చర్ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కీలక అలర్ట్ ఇచ్చింది ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం. 2023-24 సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వ్యవసాయ, సేంద్రియ, ఇంజినీరింగ్‌ విభాగాల్లో డిప్లొమా కోర్సుల పూర్తి వివరాలు, విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ www.pjtsau.edu.in లో పొందుపరిచింది. దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభం కాగా... అభ్యర్థులు ఈ నెల 26లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ట్రెండింగ్ వార్తలు

Army Public School Jobs 2024 : బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు - అప్లికేషన్ ప్రాసెస్, ఖాళీల వివరాలివే

Siddipet Accident : పెళ్లి రోజే విషాదం, రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Youth Cheated Producer : ఒక్క ఛాన్స్ అంటూ నిర్మాత చుట్టూ ప్రదక్షిణాలు, అవకాశం చిక్కగానే బంగారంతో జంప్

Cyber Crime : ప్రముఖ కంపెనీలో ఉద్యోగం, సిద్దిపేట యువతికి రూ.16 లక్షలు టోకరా - ఏపీలో సైబర్ కేటుగాడు అరెస్ట్

దరఖాస్తుల్లో ఏమైనా సవరణలు ఉంటే... జూన్ 27, 28 తేదీల్లో చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా డిప్లోమా ఇన్ అగ్రికల్చర్ (రెండేళ్ల కోర్సు), డిప్లోమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (రెండేళ్ల కోర్సు), డిప్లోమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (మూడేళ్ల కోర్సు)ల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అన్నీ కోర్సులు కూడా ఇంగ్లీష్ మాధ్యమంలోనే ఉంటాయి. పాలిసెట్ - 2023లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఈ కోర్సుల్లో సీట్లు కేటాయిస్తారు. విద్యార్థుల వయసు తప్పనిసరిగా 15 ఏళ్ల పూర్తి కావాలి. ఎస్సీ, ఎస్టీలకు దరఖాస్తు రుసుం 600 ఉండగా... మిగతా వారికి రూ. 1200గా నిర్ణయించారు.

సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

TS Inter Supplementary Exams Updates 2023: తెలంగాణ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హాల్ టికెట్ల విడుదల చేసింది తెలంగాణ ఇంటర్ బోర్డు. https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

జూన్ 12 నుంచి 22వ తేదీ వరకూ ఈ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించున్నారు ప్రతి రోజు ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి. సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. జూన్ 5 నుంచి 9 వరకు రెండు సెషన్స్ లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. మార్నింగ్ సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు.

ప్రాసెస్ ఇదే…

-విద్యార్థులు మొదటగా https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

-Student Hall Tickets -IPASE JUNE 2023 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. (ఇక్కడ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, బ్రిడ్జి కోర్సులు ఉంటాయి).

-మీకు కావాల్సిన ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత... మరో విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పదో తరగతి లేదా ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.

-గెట్ హాల్ టికెట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.

-ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ పొందవచ్చు