తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Paper Leak Case: 12 మంది అరెస్ట్, 19 మంది సాక్షులు.. సిట్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

Paper Leak Case: 12 మంది అరెస్ట్, 19 మంది సాక్షులు.. సిట్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

HT Telugu Desk HT Telugu

24 March 2023, 14:29 IST

  • TSPSC Paper Leak Case Remand Report:టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. తాజాగా మరో నలుగురిని అరెస్ట్ చేశారు. అయితే నిందితుల రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు.

పేపర్ లీక్ కేసులో కీలక విషయాలు
పేపర్ లీక్ కేసులో కీలక విషయాలు

పేపర్ లీక్ కేసులో కీలక విషయాలు

TSPSC Paper Leak Case Updates: టీఎస్పీఎస్పీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు విచారణలో తవ్వే కొద్దే అక్రమాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేయగా... తాజాగా మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుంది సిట్. ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు... రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించారు.

ట్రెండింగ్ వార్తలు

Plantix App: మూడు కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్న ప్లాంటిక్స్ యాప్… రైతుల మన్నన పొందుతున్న అప్లికేషన్

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ

పేపర్ లీకేజీకి సంబంధించి ఇప్పటికి వరకు 12 మంది నిందితులను ఆరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది సిట్. తొమ్మిది మంది నిందితులతో పాటు మరో ముగ్గురు అరెస్ట్ చేయగా... ఇందులో ఇద్దరు TSPSC ఉద్యోగులు ఉన్నట్లు ప్రస్తావించింది. ఇప్పటివరకు మొత్తం నలుగురు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగుల అరెస్ట్ కాగా... నిందితుల్లో మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడించింది. 19 మంది సాక్ష్యుల ను విచారించినట్టు రిమాండ్ రీపోర్ట్ లో స్పష్టం చేసింది.

టీఎస్పీఎస్సీ ఉద్యోగి శంకర్ లక్ష్మి ని ప్రధాన సాక్షి గా పేర్కొంది సిట్. శంకర్ లక్ష్మి తో పాటు టీఎస్పీఎస్సీ , తెలంగాణ స్టేట్ టెక్నీకల్ సర్వీస్ ఉద్యోగులను సాక్షులు గా నమోదు చేసింది. కర్మన్ ఘాట్ లోని ఒక హోటల్ లోని యాజమని, ఉద్యోగిని కూడా సాక్షి గా ప్రస్తావించింది. హోటల్ లోని సీసీటీవి కెమెరాలో నిక్షిప్తమైన పేపర్ ఎక్సెంజ్ వ్యవహారాన్ని నిక్షిప్తం చేసింది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేష్, సురేష్ లను ఆరెస్ట్ చేసినట్లు ప్రకటించగా... ముగ్గురు నిందితుల నుండి ఒక ల్యాప్ టాప్ మూడు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది.

మరోవైపు తాజాగా గురువారం అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను ఏడు రోజుల కస్టడీకి కోరింది సిట్‌. మరోవైపు ప్రస్తుతం అరెస్ట్ చేసిన వారిలో చూస్తే… A1గా ప్రవీణ్ , A2 గా నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డి, A10గా ఏఎస్వో షమీమ్, A12గా డేటా ఎంట్రీ ఆపరేటర్ రాజశేఖర్ ఉన్నారు. ఇక ఏ3గా రేణుకా రాథోడ్, ఏ4గా ఢాక్యా నాయక్, ఏ5గా కోటేశ్వర్, ఏ6గా నిలేష్ నాయక్ పేర్లను ప్రస్తావించింది సిట్.

మొత్తంగా పేపర్ లీక్ కేసులో 12 మందిని అరెస్ట్ చేయగా…వీరి విచారణ ఆధారంగా మరికొంత మందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులకు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఈక్రమంలో వారిలో కూడా కొందరు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు నోటీసులు అందుకున్నవారిలో ఎన్ఆర్ఐలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.