తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wpl Mascot Shakti: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ మస్కట్ 'శక్తి'ని చూశారా?

WPL Mascot Shakti: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ మస్కట్ 'శక్తి'ని చూశారా?

Hari Prasad S HT Telugu

02 March 2023, 13:34 IST

    • WPL Mascot Shakti: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మస్కట్ 'శక్తి'ని గురువారం (మార్చి 2) ఆవిష్కరించింది బీసీసీఐ. బోర్డు సెక్రటరీ జై షా దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ మస్కట్ శక్తి
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ మస్కట్ శక్తి

వుమెన్స్ ప్రీమియర్ లీగ్ మస్కట్ శక్తి

WPL Mascot Shakti: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) తొలి సీజన్ ప్రారంభం కావడానికి మరో రెండు రోజులే మిగిలి ఉంది. శనివారం (మార్చి 4) నుంచి ఈ లీగ్ ప్రారంభం కాబోతోంది. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ లో ఐదు టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ మస్కట్ ను గురువారం (మార్చి 2) బీసీసీఐ లాంచ్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ మస్కట్ ను శక్తి అని పిలుస్తున్నారు. ఈ సందర్భంగా శక్తి లాంచింగ్ వీడియోను బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్ లో షేర్ చేశారు. "వేగవంతమైనది, భయపెట్టేది, అగ్నితో కూడుకున్నది. ఫీల్డ్ ను వెలిగించడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇది ఆరంభం మాత్రమే. మా డబ్ల్యూపీఎల్ మస్కట్ శక్తిని పరిచయం చేస్తున్నాం" అనే క్యాప్షన్ తో జై షా ఈ వీడియో షేర్ చేశారు.

ఈ తొలి సీజన్ డబ్ల్యూపీఎల్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాళ్ల ఉత్సాహానికి తగినట్లే బోర్డు ఈ లీగ్ ప్రమోషన్ల వేగం పెంచింది. ఈ మధ్యే డబ్ల్యూపీఎల్ థీమ్ సాంగ్ కూడా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాటకు 'యే తో షురువాత్ హై' (ఇది ఆరంభం మాత్రమే) అనే టైటిల్ పెట్టారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి దేశంలో క్రికెట్ ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మహిళా క్రికెటర్లకు జేజేలు పలుకుతూ ఈ పాట సాగింది.

ఐపీఎల్ తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద లీగ్ గా డబ్ల్యూపీఎల్ నిలవనుంది. ఇందులోని ఐదు టీమ్స్ విలువ రూ.4669 కోట్లు కాగా.. మీడియా హక్కుల ద్వారా మరో రూ.951 కోట్లు బీసీసీఐ ఖాతాలో చేరాయి. ఈ లీగ్ తొలి సీజన్ లో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి.

ఇక గత నెలలోనే డబ్ల్యూపీఎల్ ప్లేయర్స్ వేలం కూడా జరిగిన విషయం తెలిసిందే. ఇందులో అత్యధికంగా స్మృతి మంధానా రూ.3.4 కోట్లకు అమ్ముడైన విషయం తెలిసిందే. ఆమెను ఆర్సీబీ టీమ్ కొనుగోలు చేసింది. ఇక ముంబై ఇండియన్స్ టీమ్ రూ.1.8 కోట్లకు హర్మన్ ను కొనుగోలు చేసి ఆమెకు కెప్టెన్సీ అప్పగించింది. డబ్ల్యూపీఎల్ మార్చి 4 నుంచి మార్చి 26 వరకూ జరగనుంది. ఇందులో 20 లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి.