WPL Title Sponsor Tata: డబ్ల్యూపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా టాటా
WPL Title Sponsor Tata: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) టైటిల్ స్పాన్సర్‌గా టాటాని అనౌన్స్ చేసింది బీసీసీఐ. ఇప్పటికే ఐపీఎల్ కు కూడా టాటానే టైటిల్ స్పాన్సర్ గా ఉన్న విషయం తెలిసిందే.
WPL Title Sponsor Tata: తొలి వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మార్చి 4 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలుసు కదా. ఈ లీగ్ కు సంబంధించి ఇప్పటికే మీడియా హక్కులు, ఫ్రాంఛైజీలు, ప్లేయర్స్ వేలం అన్నీ పూర్తయ్యాయి. తాజాగా ఈ మెగా లీగ్ టైటిల్ స్పాన్సర్ ను కూడా మంగళవారం (ఫిబ్రవరి 21) బీసీసీఐ అనౌన్స్ చేసింది.
ట్రెండింగ్ వార్తలు
ఈ డబ్ల్యూపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ ను టాటానే సొంతం చేసుకుంది. ఇప్పటికే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా ఉన్న టాటా.. ఇటు డబ్ల్యూపీఎల్ ను కూడా సొంతం చేసుకుంది. ఈ టైటిల్ స్పాన్సర్ కోసం టెండర్ డాక్యుమెంట్లు ఫిబ్రవరి 9 వరకూ అందుబాటులో ఉన్నాయి. ఈ టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే ఐదేళ్లకుగాను టాటా సన్స్ టైటిల్ స్పాన్సర్ హక్కులను సొంతం చేసుకుంది.
గతంలో వివో తప్పుకున్న తర్వాత ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ హక్కులను టాటా దక్కించుకుంది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మార్చి 4న గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ తో ప్రారంభం కానుంది. ఈ మెగా లీగ్ మార్చి 26 వరకూ కొనసాగనుంది. ఈ రెండు టీమ్స్ కాకుండా యూపీ వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తలపడుతున్నాయి.
లీగ్ లో భాగంగా మొత్తం 20 లీగ్ మ్యాచ్ లు జరుగుతాయి. టాప్ లో నిలిచిన టీమ్ నేరుగా ఫైనల్ చేరుతుంది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్ మార్చి 24న జరగనుండగా.. ఫైనల్ మార్చి 26న జరుగుతుంది. ఫిబ్రవరి మొదట్లోనే డబ్ల్యూపీఎల్ ప్లేయర్స్ వేలం కూడా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో ఇండియన్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధానా అత్యధికంగా రూ.3.4 కోట్లకు అమ్ముడైంది.
సంబంధిత కథనం