తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Women’s Premier League Schedule: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌ల టైమింగ్స్ ఇవే

Women’s Premier League Schedule: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌ల టైమింగ్స్ ఇవే

Hari Prasad S HT Telugu

14 February 2023, 20:58 IST

    • Women’s Premier League Schedule: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్(WPL Schedule) ను మంగళవారం (ఫిబ్రవరి 14) రిలీజ్ చేసింది బీసీసీఐ. వేలం జరిగిన మరుసటి రోజే బోర్డు షెడ్యూల్ రిలీజ్ చేయడం విశేషం.
ముంబై ఇండియన్స్ టీమ్ ఓనర్ నీతా అంబానీతో హెడ్ కోచ్ చార్లెట్ ఎడ్వర్డ్, టీమ్ మెంటార్ ఝులన్ గోస్వామి
ముంబై ఇండియన్స్ టీమ్ ఓనర్ నీతా అంబానీతో హెడ్ కోచ్ చార్లెట్ ఎడ్వర్డ్, టీమ్ మెంటార్ ఝులన్ గోస్వామి (ANI )

ముంబై ఇండియన్స్ టీమ్ ఓనర్ నీతా అంబానీతో హెడ్ కోచ్ చార్లెట్ ఎడ్వర్డ్, టీమ్ మెంటార్ ఝులన్ గోస్వామి

Women’s Premier League Schedule: తొలి వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)కు టైమ్ దగ్గరపడింది. ఈ లీగ్ షెడ్యూల్ మంగళవారం (ఫిబ్రవరి 14) రిలీజైంది. ప్లేయర్స్ వేలం ముగిసిన మరుసటి రోజే బీసీసీఐ ఈ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఐదు టీమ్స్ పాల్గొంటున్న ఈ లీగ్ మార్చి 4న ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రారంభం కానుంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

మార్చి 26 వరకూ అంటే 23 రోజుల పాటు తొలి సీజన్ సాగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ జట్లుఈ లీగ్ లో పోటీ పడుతున్నాయి. ఈ ఐదు ఫ్రాంఛైజీలు కలిపి వేలంలో మొత్తం 87 మంది ప్లేయర్స్ ను కొనుగోలు చేశాయి. వీళ్లలో 30 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు.

డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ ఇలా..

బీసీసీఐ మీడియా ప్రకటన ప్రకారం.. డబ్ల్యూపీఎల్ లో మొత్తం 20 లీగ్ మ్యాచ్ లు జరుగుతాయి. తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి. ఇక మరుసటి రోజే లీగ్ లో తొలి డబుల్ హెడర్ జరుగుతుంది. మార్చి 5 ఆదివారం నాడు తొలి మ్యాచ్ లో ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ ఆడనుండగా.. తర్వాతి మ్యాచ్ యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరగనుంది.

తొలి సీజన్ లో మొత్తం నాలుగు డబుల్ హెడర్స్ ఉంటాయి. ఆ రోజుల్లో తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతాయి. లీగ్ మొత్తం ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియంలలో జరుగుతాయి. ఈ రెండు స్టేడియాలు చెరో 11 మ్యాచ్ లకు ఆతిథ్యమివ్వనున్నాయి.

చివరి లీగ్ మ్యాచ్ మార్చి 21న ఢిల్లీ, యూపీ మధ్య జరుగుతుంది. లీగ్ స్టేజ్ లో టాప్ లో నిలిచి టీమ్ నేరుగా ఫైనల్ వెళ్తుంది. ఇక మార్చి 24న ఎలిమినేటర్ మ్యాచ్ కు డీవై పాటిల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుండగా.. మార్చి 26న బ్రబౌర్న్ స్టేడియంలో ఫైనల్ జరుగుతుంది.

టాపిక్