తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  West Indies Coach Phil Simmons Step Down: విండీస్ కోచ్ సిమ్మన్స్‌ గుడ్‌బై.. టీ20 వరల్డ్ కప్ పరాజయంతో నిష్క్రమణ

West Indies Coach Phil Simmons Step Down: విండీస్ కోచ్ సిమ్మన్స్‌ గుడ్‌బై.. టీ20 వరల్డ్ కప్ పరాజయంతో నిష్క్రమణ

25 October 2022, 7:53 IST

    • West Indies Coach Phil Simmons Step Down: వెస్టిండీస్ హెడ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ తన పదవీ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించారు. టీ20 వరల్డ్ కప్‌లో తొలి రౌండులోనే కరేబియన్ జట్టు నిష్క్రమించడంపై బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
వెస్టిండీస్ హెడ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ రాజీనామా
వెస్టిండీస్ హెడ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ రాజీనామా (AP)

వెస్టిండీస్ హెడ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ రాజీనామా

West Indies Coach Phil Simmons Step Down: రెండు సార్లు టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్ జట్టు అనూహ్యమైన రీతిలో ఈ ఏసారి తొలి రౌండులో వెనుదిరిగింది. పొట్టి వరల్డ్ కప్ అర్హత కోసం నిర్వహించిన పోటీల్లో నాలుగు జట్ల గ్రూప్-బీలో చివరి స్థానంలో నిలిచింది. ఫలితంగా మొత్తం టోర్నీ నుంచే నిష్క్రమించింది. ఈ పరాభవంతో కరెబియన్ అభిమానుల నుంచి సరత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే ఆ పరాజయం తర్వాత విండీస్ హెడ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ తన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(CWI) సోషల్ మీడియా ద్వారా సిమ్మన్స్ తెలియజేశారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"ఇది కేవలం జట్టును మాత్రమే కాదు.. మేము ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలను కూడా బాధపెడుతుందని నేను అంగీకరిస్తున్నాను. ఈ ఓటమి చాలా నిరాశపరిచింది. హృదయాన్ని కదిలించింది. ఆట మొదలుపెట్టకుండానే ఆట నుంచి బయటకు వచ్చేశాం. మా ప్రమేయం లేకుండా బయటకు వెళ్లడం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇందుకు మా అభిమానులు, ఫాలోవర్లు క్షమాపణలు కోరుతున్నాను." అని సిమ్మన్స్ తన ప్రకటనను సీడబ్ల్యూఐ ద్వారా తెలియజేశారు.

నవంబరు 30 నుండి డిసెంబరు 12 మధ్య ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌ ఫిల్ సిమ్మన్స్‌కు కోచ్‌గా చివరది కానుంది. అనంతరం ఆయన కరేబియన్ జట్టు కోచ్‌ పదవి నుంచి తప్పుకోనున్నారు. ఇంతకుముందు సిమ్మన్స్ 2016లో వెస్టిండీస్ టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కోచ్‌గా వ్యవహరించారు. ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన రిచర్డ్స్-బోథమ్ ట్రోఫీని 1-0 తేడాతో విండీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.

"వెస్టిండీస్ హెడ్ కోచ్‌గా ఉండటాన్ని పూర్తిగా ఆస్వాదించాను. మేనేజ్మెంట్, జట్టు నుంచి నాకు పూర్తి మద్దతు లభించింది. వెస్టిండీస్ ఉత్తమ ప్రయోజనాల కోసం పని చేస్తూనే ఉంటానని, నేను దృఢంగా విశ్వసిస్తున్నా. వెస్టిండీస్ క్రికెట్‌లో కొంతమంది అసాధారణ వ్యక్తులు ఉన్నారు. వాళ్లు జట్టును ముందుకు నడిపిస్తారు." అని ఫిల్ సిమ్మన్స్ స్పష్టం చేశారు.

ఈ టీ20 వరల్డ్ కప్ తొలి రౌండులోనే విండీస్ వైదొలగడం అభిమానులను అసంతృప్తికి గురిచేసింది. అర్హత పోటీల్లో నాలుగు జట్ల గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-12 దశకు చేరుకున్నాయి. అయితే విండీస్ మాత్రం చివరి స్థానంలో నిలిచి మొత్తం టోర్నీ నుంచే నిష్క్రమించింది.