WI vs IRE: వెస్టిండీస్‌కు ఐర్లాండ్‌ షాక్‌.. టీ20 వరల్డ్‌కప్‌ నుంచి ఔట్‌-wi vs ire in t20 world cup as west indies out of the cup as they lost to ireland ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Wi Vs Ire In T20 World Cup As West Indies Out Of The Cup As They Lost To Ireland

WI vs IRE: వెస్టిండీస్‌కు ఐర్లాండ్‌ షాక్‌.. టీ20 వరల్డ్‌కప్‌ నుంచి ఔట్‌

Hari Prasad S HT Telugu
Oct 21, 2022 12:55 PM IST

WI vs IRE: వెస్టిండీస్‌కు ఐర్లాండ్‌ షాక్‌ ఇచ్చింది. దీంతో రెండుసార్లు టీ20 వరల్డ్‌కప్‌ ఛాంపియన్‌ అయిన విండీస్‌ టీమ్‌.. ఈసారి కనీసం సూపర్‌ 12 స్టేజ్‌కు కూడా చేరకుండానే ఇంటిదారి పట్టింది.

సూపర్ 12 స్టేజ్ కూడా చేరకుండానే ఇంటిదారి పట్టిన రెండుసార్లు ఛాంపియన్ వెస్టిండీస్
సూపర్ 12 స్టేజ్ కూడా చేరకుండానే ఇంటిదారి పట్టిన రెండుసార్లు ఛాంపియన్ వెస్టిండీస్ (AFP)

WI vs IRE: వెస్టిండీస్‌ క్రికెట్‌ మరింత పాతాళంలోకి జారిపోయింది. టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌ 12 స్టేజ్‌కు నేరుగా అర్హత సాధించలేకపోయిన ఆ టీమ్‌.. ఇప్పుడు అర్హత టోర్నీలోనూ స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌ చేతుల్లో పరాజయాలతో ఇంటిదారి పట్టింది. శుక్రవారం (అక్టోబర్‌ 21) ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ ఏకంగా 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ విజయంతో ఐర్లాండ్ సూపర్ 12కు చేరింది.

ట్రెండింగ్ వార్తలు

వెస్టిండీస్‌ విసిరిన 147 రన్స్‌ టార్గెట్‌ను ఐర్లాండ్‌ 17.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి చేజ్‌ చేసింది. ఐర్లాండ్‌ ఓపెనర్‌ పాల్ స్టిర్లింగ్‌ 48 బాల్స్‌లోనే 66 రన్స్‌తో చెలరేగాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. లోర్కార్‌ టక్కర్‌ కూడా 35 బాల్స్‌లో 45 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు అజేయంగా 77 రన్స్‌ జోడించారు.

2012, 2016లలో రెండుసార్లు టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన వెస్టిండీస్‌ టీమ్‌.. ఈసారి కనీసం సూపర్‌ 12 స్టేజ్‌కు కూడా చేరకపోవడం కరీబియన్‌ ఫ్యాన్స్‌కు మింగుడు పడనిదే. ఈసారి తొలి మ్యాచ్‌లోనే స్కాట్లాండ్‌ చేతుల్లో ఓడిన విండీస్‌.. తర్వాత జింబాబ్వేపై గెలిచి గాడిలో పడినట్లు కనిపించింది. అయితే చివరి మ్యాచ్‌లో మరోసారి విండీస్‌ బ్యాటర్లు విఫలమయ్యారు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 రన్స్‌ మాత్రమే చేసింది. బ్రాండన్‌ కింగ్‌ 48 బాల్స్‌లో 62 రన్స్‌ చేశాడు. ఓపెనర్ జాన్సన్‌ చార్లెస్‌ 24, ఒడియన్‌ స్మిత్‌ 19 రన్స్‌ చేశారు. ఐర్లాండ్‌ బైలర్‌ గారెత్‌ డెలానీ 4 ఓవర్లలో కేవలం 16 రన్స్‌ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అతనికే ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

అయితే ఈ టార్గెట్‌న ఐర్లాండ్‌ ఇంత సులువుగా చేజ్‌ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. విండీస్‌ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. అకీల్ హొసేన్‌ మాత్రమే ఒక వికెట్‌ తీశాడు. ఇక మిగతా బౌలర్లంతా చేతులెత్తేశారు. అల్జారీ జోసెఫ్‌ 4 ఓవర్లలో 39 రన్స్‌ ఇచ్చాడు. మూడు మ్యాచ్‌లలో రెండు ఓడిన విండీస్.. ఇక ఇంటికెళ్లిపోనుంది.

WhatsApp channel