తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Suryakumar On His Favourite T20 Innings: ఆ ఇన్నింగ్స్‌ మళ్లీ మళ్లీ చూస్తూనే ఉంటా: సూర్యకుమార్‌

Suryakumar on his favourite T20 innings: ఆ ఇన్నింగ్స్‌ మళ్లీ మళ్లీ చూస్తూనే ఉంటా: సూర్యకుమార్‌

Hari Prasad S HT Telugu

29 November 2022, 20:44 IST

    • Suryakumar on his favourite T20 innings: తాను ఆడిన ఆ ఇన్నింగ్స్‌ మళ్లీ మళ్లీ చూస్తూనే ఉంటా అని అన్నాడు సూర్యకుమార్‌ యాదవ్‌. తన ఫేవరెట్‌ టీ20 ఇన్నింగ్స్‌ గురించి అడిగినప్పుడు అతడిలా స్పందించాడు.
సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ (AP)

సూర్యకుమార్ యాదవ్

Suryakumar on his favourite T20 innings: సూర్యకుమార్‌ యాదవ్.. ప్రస్తుతం ప్రపంచ టీ20 క్రికెట్‌లో మేటి బ్యాటర్. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌గా కొనసాగుతున్నాడు. అతడు ఇండియా తరపున టీ20 అరంగేట్రం చేసి రెండేళ్లు కూడా పూర్తి కాలేదు కానీ పెద్ద సెన్సేషన్‌గా నిలిచాడు. ఈ మధ్యే ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో 239 రన్స్‌తో మూడో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఇప్పటి వరకూ ఇండియా తరఫున 57 మ్యాచ్‌లు ఆడిన సూర్య.. 1800 రన్స్‌ చేశాడు. అందులో రెండు సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాదిన్నర కాలంలో ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్‌ కూడా ఆడాడు. అయితే తన ఫేవరెట్‌ టీ20 ఇన్నింగ్స్ గురించి అడిగినప్పుడు అతడు రెండు ఇన్నింగ్స్‌ గురించి చెప్పాడు. ఈఎస్పీఎన్‌ క్రికిన్ఫో 25 కొశన్స్‌ సిరీస్‌లో మాట్లాడుతూ.. తన తొలి హాఫ్‌ సెంచరీతోపాటు ఐపీఎల్‌లో చెన్నైపై ఆడిన ఇన్నింగ్స్‌ గురించి చెప్పుకొచ్చాడు.

నిజానికి ఇంగ్లండ్‌పై చేసిన 117 రన్స్‌, న్యూజిలాండ్‌పై గత వారమే చేసిన 111 ఇన్నింగ్స్‌ అభిమానులకు బాగా నచ్చాయి. కానీ సూర్య లిస్ట్‌లో మాత్రం ఈ రెండు ఇన్నింగ్స్‌ లేవు. "నా తొలి మ్యాచ్‌లో ఆడిన ఇన్నింగ్స్‌ అనుకుంటున్నా. నా తొలి ఫిఫ్టీ. ఆ మ్యాచ్ మేము గెలిచాము. అందుకు అది చాలా స్పెషల్‌" అని సూర్యకుమార్‌ చెప్పాడు.

అతడు గతేడాది మార్చిలో ఇండియా తరఫున అరంగేట్రం చేయగా.. ఇంగ్లండ్‌తో తనకు బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చిన తొలి మ్యాచ్‌లోనే చెలరేగిపోయాడు. ఆ మ్యాచ్‌లో అతడు 31 బాల్స్‌లోనే 57 రన్స్‌ చేశాడు. అందులో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో రివర్స్‌ ర్యాంప్‌ షాట్‌ ఆడిన సూర్య తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.

ఇక తాను మళ్లీ మళ్లీ చూడాలనుకునే ఇన్నింగ్స్‌ ఐపీఎల్‌లో చెన్నైపై ఆడినట్లు కూడా సూర్య తెలిపాడు. "2019లో క్వాలిఫయర్‌ 1లో ముంబై, చెన్నై మ్యాచ్‌లో నేను ఆడిన ఇన్నింగ్స్‌. ఆ మ్యాచ్‌లో చిన్నదే అయినా 130-135 టార్గెట్‌ చేజింగ్‌ కష్టంగా సాగింది. అలాంటి మ్యాచ్‌లోనే నేను 70 నాటౌట్‌గా నిలిచాను. మేము మ్యాచ్‌ గెలిచాం. ఆ ఇన్నింగ్స్‌ ఎన్నిసార్లయినా చూస్తూనే ఉంటాను" అని సూర్య చెప్పాడు.

టాపిక్