Suryakumar in No.1 rank: అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్న సూర్యకుమార్-suryakumar yadav top one extends lead over mohammad rizwan ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Suryakumar Yadav Top One Extends Lead Over Mohammad Rizwan

Suryakumar in No.1 rank: అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్న సూర్యకుమార్

Maragani Govardhan HT Telugu
Nov 23, 2022 09:03 PM IST

Suryakumar in No.1 rank: సూర్యకుమార్ యాదవ్ తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. 890 పాయింట్లతో టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ (ICC Twitter)

Suryakumar in No.1 rank: టీ20 ఫార్మాట్‌లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు తిరుగేలేకుండా దూసుకెళ్తున్నాడు. వరుసపెట్టి అర్ధశతకాల మోత మోయిస్తూ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇటీవల జరిగిన న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ 51 బంతుల్లో 111 పరుగుతో అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. ఫలితంగా తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కివీస్‌తో జరిగిన రెండో టీ20లో సెంచరీతో తన అగ్రపీఠాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఈ సిరీస్ చివరి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపని కారణంగా 890 పాయింట్లతో ముందు వరుసలో ఉన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

ఆదివారం నాటికి 895 పాయింట్లతో కెరీర్ బెస్ట్ అందుకున్న సూర్యకుమార్ యాదవ్.. కివీస్‌తో చివరి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపని కారణంగా 5 పాయింట్లు తగ్గి 890 పాయింట్లతో సర్దుకున్నాడు. అయినప్పటికీ తన సమీప బ్యాటర్, రెండో స్థానంలో ఉన్న మహమ్మద్ రిజ్వాన్‌తో పోలిస్తే అంతరం చాలా ఉంది. రిజ్వాన్ కంటే 54 పాయింట్లు మెరుగ్గా ఉన్నాడు సూర్యకుమార్. కివీస్‌తో జరిగిన రెండు టీ20ల్లో కలిపి 124 పరుగులు చేశాడు. అంతేకాకుండా రోహిత్ శర్మ(2018) తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్‌లో టీ20 క్రికెట్‌లో రెండు సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

ఈ ఏడాది 31 టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ 1164 పరుగులతో అదరగొట్టాడు. అంతేకాకుండా ఒక క్యాలెండర్ ఇయర్‌లో వెయ్యికి పైగా పరుగులు చేసిన మొదటి భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌లోనూ 239 పరుగులతో ఆకట్టుకున్నాడు.

సూర్యకుమార్ తర్వాత పాకిస్థాన్ ప్లేయర్ మహమ్మద్ రిజ్వాన్ 836 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మరోపక్క పాక్ కెప్టెన్ బాబర్ ఆజం 778 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ ఓపెనర్ డేవాన్ కాన్వే మూడో స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. మరో కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 7వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.

బౌలర్ల విషయానికొస్తే టాప్-10 బౌలర్లలో ఏ మాత్రం మార్పు లేదు. భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 11వ స్థానాన్ని చేరుకున్నాడు. న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌధీ కూడా రెండు స్థానాలు పెరిగి 14వ ర్యాంకుకు చేరాడు.

వన్డే ర్యాంకింగ్స్ విషయానికొస్తే ఇంగ్లాండ్‌తో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్ తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. స్టీవ్ స్మిత్ మూడు స్థానాలు మెరుగుపడగా.. డేవిడ్ వార్నర్ సెంచరీతో కదం తొక్కడంతో ఐదో స్థానంలో నిలిచాడు. మరోపక్క విరాట్ కోహ్లీ ఇటీవల కాలంలో వన్డేలు ఆడనప్పటికీ అతడు ఆరో స్థానంలోనే ఉండటం గమనార్హం.

WhatsApp channel

సంబంధిత కథనం