తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gavaskar On Sarfaraz Khan: స్లిమ్ ఉండేవాళ్లు కావాలంటే ఫ్యాషన్ షోలకు వెళ్లండి.. క్రికెట్‌కు ఫిట్‌నెస్ ఉంటే చాలు -గవాస్కర్

Gavaskar on Sarfaraz Khan: స్లిమ్ ఉండేవాళ్లు కావాలంటే ఫ్యాషన్ షోలకు వెళ్లండి.. క్రికెట్‌కు ఫిట్‌నెస్ ఉంటే చాలు -గవాస్కర్

19 January 2023, 21:49 IST

    • Gavaskar on Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్‌ను ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై టీమిండియా మాజీ సునీల్ గవాస్కర్ స్పందించాడు. స్లిమ్‌గా ఉండేవాళ్లు కావాలనుకుంటే ఫ్యాషన్ షోలకు వెళ్లాలని, క్రికెట్‌కు ఫిట్‌నెస్ చాలని సెలక్టర్లపై మండిపడ్డారు.
గవాస్కర్
గవాస్కర్ (AFP)

గవాస్కర్

Gavaskar on Sarfaraz Khan: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం ఇటీవలే ప్రకటించిన భారత జట్టులో.. యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే. దేశవాళి క్రికెట్‌లో బాగా రాణిస్తున్న అతడిని ఈ టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తపరిచాడు. ఎంత కష్టపడినప్పటికీ తనను మాత్రం భారత జట్టులోకి తీసుకోవట్లేదని వాపోయాడు. తాజాగా ఈ అంశంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. సెలక్టర్లు షేప్, సైజ్‌ను చూసి ఆటగాళ్లను ఎంపిక చేయకూడదని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"ఆటగాళ్లు ఫిట్‌గా లేకుంటే సెంచరీలు సాధించలేరు. కాబట్టి క్రికెట్‌లో ఫిట్‌నెస్ అనేది చాలా ముఖ్యం. యో యో టెస్టు లేదా ఇంకేదైనా పరీక్ష ఏది చేసినప్పటికీ అందులో నాకెలాంటి ఇబ్బంది లేదు. కానీ అదొక్కటే ప్రధానంగా తీసుకోకూడదు. క్రికెట్‌లో ఆటగాడు ఫిట్‌గా ఉంటే సరిపోతుంది." అని గవాస్కర్ అన్నారు.

"అతడు(సర్ఫరాజ్ ఖాన్) సెంచరీలు చేస్తున్నప్పుడు ఫీల్డ్‌కు దూరంగా ఉండడు. అతడు మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడంటే ఫిట్‌గా ఉన్నట్లే కదా. ఒకవేళ మీరు స్లిమ్‌గా, సన్నగా ఉన్న వారినే తీసుకోవాలనుకుంటున్నారా? అప్పుడు ఏ ఫ్యాషన్ షోకో వెళ్లి కొంతమంది మోడల్స్‌ను తీసుకురండి. వారి చేతికి బంతి లేదా బ్యాట్ ఇచ్చి ఆడమని చెప్పండి. క్రికెటర్లలో అన్నీ షేపులు, సైజులు ఉన్నవారందరూ ఉంటారు. కాబట్టి పరిమాణం, ఆకృతినే ప్రమాణంగా తీసుకోకుండా వారి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోండి." అని సునీల్ గవాస్కర్ తెలిపారు.

సర్ఫరాజ్ ఖాన్ గత మూడు దేశవాళీ సీజన్లలో 2441 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌ జట్టులో అడుగుపెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. వచ్చే నెల నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌కు ఎంపికవుతాడని ఆశించిన అతడికి రిక్తహస్తాలే మిగిలాయి.

టాపిక్