తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Indw Vs Slw Asia Cup Final: మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో టాస్ గెలిచిన లంక జట్టు.. భారత్ బౌలింగ్

IndW vs SLW Asia Cup Final: మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో టాస్ గెలిచిన లంక జట్టు.. భారత్ బౌలింగ్

15 October 2022, 12:58 IST

    • IndW vs SLW Asia Cup Final: భారత మహిళల జట్టుతో జరుగుతున్న టీ20 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక అమ్మాయిలు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఇందులో నెగ్గి టైటిల్ సొంతం చేసుకోవాలని ఇరు జట్లు ఆశిస్తున్నాయి.
భారత్-శ్రీలంక టాస్
భారత్-శ్రీలంక టాస్

భారత్-శ్రీలంక టాస్

IndW vs SLW Asia Cup Final: భారత మహిళల జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక అమ్మాయిలు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. సిల్హౌట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆసియా కప్ విజయం ఇరుజట్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. తుదిపోరులో గెలిచి టైటిల్ సొంతం చేసుకోవాలని తహతహలాడుతున్నాయి. గ్రూప్ దశలో మిగిలిన జట్లపై పైచేయి సాధించిన టీమిండియా.. తుదిపోరులోనూ గెలిచేందుకు తన వ్యూహాలను సిద్ధం చేసుకుంది. మరోపక్క శ్రీలంక కూడా గెలుపు కోసం ఆత్రుతగా చూస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

శ్రీలంక జట్టులో ఎలాంటి మార్పు లేదు. టీమిండియా మాత్రం ఓ మార్పుతో బరిలో దిగుతోంది. రాధాయాదవ్ స్థానంలో హేమలతకు అవకాశం కల్పించింది. ఆసియా కప్ ఫైనల్ కావడంతో ఇరు జట్లు మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.

సెమీ ఫైనల్లో భారత జట్టు ఏకపక్షంగా ఆధిపత్యం ఆడి థాయ్‌లాండ్‌ను ఓడించింది. మరోపక్క శ్రీలంక పాకిస్థాన్‌ను ఒక్క పరుగు తేడాతో ఓడించి ఫైనల్‌కు అడుగుపెట్టింది. లీగ్ దశలో టీమిండియా ఆడిన ఆరు గేమ్‌ల్లో ఒకదాంట్లో మాత్రమే ఓడిపోయి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోపక్క శ్రీలంక రెండింటిలో ఓడి మూడో స్థానంలో ఉంది.

తుది జట్లు..

భారత మహిళల జట్టు..

షెఫాలీ వర్మ, స్మృతీ మంధానా, జెమిమా రోడ్రిగ్స్, దయాలన్ హేమలత, హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, స్నేహ్ రానా, రేణుకా సింగ్, రాజేశ్వరీ గైక్వాడ్

శ్రీలంక మహిళల జట్టు..

చమారి ఆటపట్టు(కెప్టెన్), అనుష్క సంజీవిని, హర్షిత మాదవి, హాసిని పెరీరా, నిలాక్షి డిసిల్వా, కవిషా దిల్హారీ, మైషా షెహానీ, ఓషాడి రానసింఘే, సుగాంధిక కుమారి, ఇంకో రణవీర, అచిని కులసురియా