తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Soccer Star Pele Death: ఫుట్‌బాల్ లెజెండ్ పీలే కన్నుమూత

Soccer star Pele death: ఫుట్‌బాల్ లెజెండ్ పీలే కన్నుమూత

HT Telugu Desk HT Telugu

30 December 2022, 2:00 IST

  • Soccer star Pele death: ఫుట్‌బాల్ లెజెండ్ పీలే 82 ఏళ్ల వయస్సులో గురువారం సాయంత్రం మరణించారు. 

బ్రెజిలియన్ సాకర్ లెజెండ్ పీలే
బ్రెజిలియన్ సాకర్ లెజెండ్ పీలే (REUTERS)

బ్రెజిలియన్ సాకర్ లెజెండ్ పీలే

సావో పాలో: చెప్పులు లేని పేదరికం నుండి ఆధునిక చరిత్రలో గొప్ప, ప్రసిద్ధ అథ్లెట్లలో ఒకరిగా ఎదిగిన లెజెండరీ బ్రెజిలియన్ సాకర్ ప్లేయర్ పీలే 82 సంవత్సరాల వయస్సులో గురువారం మరణించారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

సావో పాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో పీలే చికిత్స పొందుతూ బ్రెజిల్ కాలమానం ప్రకారం సాయంత్రం 3.27 గంటలకు కన్నుమూశారు. పెద్ద పేగు క్యాన్సర్ కారణంగా శరీరంలోని వివిధ అవయవాలు పనిచేయడంలో వైఫల్యం చెందడంతో ఆయన మరణించినట్టు ఐన్‌స్టీన్ ఆసుపత్రి ప్రకటించింది.

మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన ఏకైక వ్యక్తిగా పీలే చరిత్ర పుట్టల్లోకి ఎక్కారు. ఆయన మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా సంతాప సందేశాలు వెలువడ్డాయి. ప్రపంచ ఫుట్‌బాల్‌లో బ్రెజిల్ ఆధిపత్యానికి ప్రతిబింబంగా నిలిచిన పీలే మరణంపై క్రీడారంగం, రాజకీయ రంగం, సాంస్కృతిక రంగాల నుంచి ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు.

‘గేమ్. కింగ్. ఎటర్నిటీ’ అని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ట్విట్టర్‌లో తన పీలేను అభివర్ణించారు. సెప్టెంబరు 2021లో పెద్ద పేగులో కణితిని తొలగించినప్పటి నుంచి ఆయన కీమోథెరపీ చేయించుకుంటున్నారు.

2012లో తుంటి ఆపరేషన్ విఫలమైనప్పటి నుండి పీలే వేరొకరి సహాయం లేకుండా నడవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఫిబ్రవరి 2020లో పీలే అనారోగ్యంతో ఉన్న శారీరక స్థితి తనను ఆందోళనకు గురిచేసిందని ఆయన కుమారుడు ఎడిన్హో చెప్పారు.

పీలే అసలు పేరు ఎడ్సన్ అరంటెస్ డో నాసిమెంటో. 1956లో శాంటోస్‌ క్లబ్‌లో చేరారు. ఈ చిన్న తీరప్రాంత క్లబ్‌ను ఫుట్‌బాల్‌లో అత్యంత ప్రసిద్ధ పేర్లలో ఒకటిగా మార్చారు.

పీలే మూడు వరల్డ్ కప్ విన్నర్ మెడల్స్ సాధించాడు. తొలిసారి 1958లో 17 ఏళ్ల వయస్సులో స్వీడన్‌లో, రెండోది నాలుగేళ్ల తరువాత చీలీలో గెలిచాడు. గాయాల కారణంగా టోర్నమెంట్‌లో ఎక్కువ భాగం పాల్గొనకపోయినప్పటికీ, మూడోది మెక్సికోలో 1970 గెలుచుకున్నాడు.

1974లో పీలే శాంటోస్ నుంచి రిటైరయ్యాడు. తిరిగి ఏడాది తరువాత ఆశ్చర్యకరంగా న్యూయార్క్ కాస్మోస్‌లో జాయినయ్యాడు. 21 ఏళ్ల అద్భుతమైన కెరీర్‌లో 1,283 గోల్స్ చేశాడు. పీలే 20వ శతాబ్దపు ప్రపంచ ఐకాన్‌గా గుర్తింపు పొందాడు.

విజయ దరహాసం, అభిమానులను ఆకట్టుకునే వినయం కారణంగా ఆయన చాలా మంది హాలీవుడ్ స్టార్లు, పోప్, అధ్యక్షుల కంటే ప్రాచుర్యం పొందారు.

టాపిక్