తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pele Health Update: పీలే ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం - కీమో థెర‌ఫీకి స్పందించ‌ని ఫుట్‌బాల్ దిగ్గ‌జం

Pele Health Update: పీలే ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం - కీమో థెర‌ఫీకి స్పందించ‌ని ఫుట్‌బాల్ దిగ్గ‌జం

03 December 2022, 22:06 IST

  • Pele Health Update: ఫుట్‌బాల్ దిగ్గ‌జం పీలే ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించిన‌ట్లు బ్రెజిల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. కీమోథెర‌ఫీకి పీలే స్పందించ‌డం లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

పీలే
పీలే

పీలే

Pele Health Update: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గ‌జం పీలే ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌మంగా మారిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. కీమో థెర‌ఫీకి అత‌డు స్పందించ‌డం లేద‌ని స‌మాచారం. గ‌త ఏడాది పేగు క్యాన్స‌ర్ బారిన ప‌డ్డాడు పీలే. అత‌డి పెద్ద పేగు నుంచి క‌ణితిని డాక్ట‌ర్లు తొల‌గించారు. క్యాన్స‌ర్ కార‌ణంగా ఇటీవ‌లే పీలే ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా మార‌డంతో బ్రెజిల్ సావోపోలో సిటీలోని ఆల్బ‌ర్ట్ ఐన్‌స్టీన్ హాస్పిట‌ల్‌కు కుటుంబ‌స‌భ్యులు త‌ర‌లించారు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

పీలే హెల్డ్ కండీష‌న్ బాగానే ఉంద‌ని ఇటీవ‌ల ఆయ‌న కెలీ నాసిమెంటో సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించింది. కానీ శ‌నివారం పీలే ఆరోగ్యం క్షీణించిన‌ట్లు బ్రెజిల్ ప‌త్రిక‌లు పేర్కొన్నాయి. ప్ర‌స్తుతం పీలే కీమో థెర‌ఫీకి స్పందించ‌డం లేద‌ని స‌మాచారం. పీలేను పాలియోటివ్ కేర్ యూనిట్‌కు త‌ర‌లించిన‌ట్లు స‌మాచారం. ప్రాణాంత‌క వ్యాధుల కార‌ణంగా మ‌ర‌ణ‌పు ముంగిట ఉన్న‌వారిని పాలియోటివ్ కేర్ యూనిట్‌కు త‌ర‌లిస్తుంటారు.

కుటుంబ‌స‌భ్యుల అనుమ‌తితోనే పీలేను పాలియోటివ్ కేర్‌కు షిఫ్ట్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్స్‌లో ఒకడిగా పీలే పేరుతెచ్చుకున్నాడు. తన కెరీర్‌లో మొత్తం 1363 మ్యాచ్‌లు ఆడిన పీలే 1279 గోల్స్‌ చేశాడు.అత్య‌ధిక‌గోల్స్ చేసిన ప్లేయ‌ర్‌గా గిన్నిస్‌ రికార్డు పీలే పేరుమీద న‌మోదైంది. బ్రెజిల్ తరఫున 92 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 77 గోల్స్‌ చేశాడు.

టాపిక్

తదుపరి వ్యాసం