తెలుగు న్యూస్  /  Sports  /  Shreyas Iyer Ruled Out Of India Vs Australia 1st Test

Shreyas Iyer out of India vs Australia 1st Test: ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు శ్రేయాస్ దూరం.. రేసులో గిల్, సూర్యకుమార్

01 February 2023, 12:30 IST

    • Shreyas Iyer out of India vs Australia 1st Test: ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టుకు శ్రేయాస్ అయ్యర్ దూరం కానున్నాడు. దీంతో అతడి స్థానంలో సూర్యకుమార్, గిల్‌ను ఆడించే అవకాశం కనిపిస్తోంది.
శ్రేయాస్ అయ్యర్
శ్రేయాస్ అయ్యర్ (AP)

శ్రేయాస్ అయ్యర్

ఆస్ట్రేలియాతో టీమిండియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడనున్న సంగతి తెలిసిందే. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా కంగారూ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే ఈ సిరీస్‌కు ముందే టీమిండియాకు షాక్ తగిలింది. టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న శ్రేయాస్ అయ్యర్ ఫస్ట్ టెస్టుకు దూరం కానున్నాడు. వెన్ను గాయం కారణంగా మొత్తానికి అతడు అందుబాటులో ఉండట్లేదు. ఇటీవల గాయం బారిన పడిన శ్రేయాస్.. దాని నుంచి కోలుకోవడంలో విఫలమవయ్యాడు. ఫలితంగా అతడు స్థానంలో మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్ ఇద్దరిలొ ఒకరికి అవకాశం లభించనుంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

టెస్టు క్రికెట్‌లో శ్రేయాస్ నిలకడగా రాణిస్తున్నాడు. డిసెంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. తాజాగా గాయం బారిన పడటంతో అతడు ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరం కానున్నాడు.

"2021 చివర్లో న్యూజిలాండ్.. భారత్‌లో పర్యటించినప్పటి నుంచి శుబ్‌మన్ గిల్‌ మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్నాడు. కేఎల్ రాహుల్.. మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తున్నాడు. రాహుల్ గాయపడినప్పుడు గిల్ ఓపెనింగ్ వచ్చాడు. అనంతరం అతడు మళ్లీ గాయపడటంతో తిరిగి మిడిల్ ఆర్డర్‌లో ఆడనున్నాడు." అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు చెప్పారు.

టెస్టుల్లో ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ రెగ్యూలర్‌గా ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. తర్వాతి స్థానాల్లో ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ వరుసగా ఆడుతున్నారు. అయితే ఐదో స్థానంలో భారత్‌కు చాలా కీలకం కానుంది. ఎందుకంటే రెండో కొత్త బంతిని తీసుకునే అవకాశముంది కాబట్టి ఆ స్థానంలో నిలకడైన ఆటగాడి కోసం భారత్ చూస్తోంది.

"వెస్టిండీస్-ఏ, భారత్-ఏ మధ్య జరిగిన మ్యాచ్‌లో గిల్ మిడిలార్డర్‌లో ఆడాడు. ఆ టెస్టులో అతడు డబుల్ సెంచరీ కొట్టాడు. కాబట్టి అతడు మిడిలార్డర్‌లో పూర్తిగా న్యాయం చేస్తాడని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. స్పిన్నర్లపై సూర్యకుమార్ యాదవ్ ఆధిపత్యం చెలాయిస్తే అతడి వల్ల అదనపు ప్రయోజనం చేకూరే అవకాశముంది. అలా కాకుండా నాథన్ లియోన్..సూర్యకుమాన్ నియంత్రిస్తాడనుకుంటే కమిన్స్, హేజిల్‌వుడ్ లాంటి వారి సమర్థవంతంగా ఎదుర్కోగలిగే గిల్‌ మెరుగ్గా రాణిస్తాడు." అని మాజీ నేషనల్ సెలక్టర్ అన్నారు.

శ్రేయాస్ అయ్యర్.. న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమయ్యాడు. వెన్ను గాయం కారణంగా బాధపడుతున్న అతడు నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అక్కడే ఉండి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.