తెలుగు న్యూస్  /  Sports  /  Shoaib Akhtar Says Virat Kohli Is Man Of Steel And His Wife Anushka Sharma An Iron Lady

Shoaib Akhtar on Virat Kohli: 'కోహ్లీ మ్యాన్ ఆఫ్ స్టీల్.. అనుష్క శర్మ ఐరన్ లేడీ'.. అక్తర్ సంచలన వ్యాఖ్యలు

09 September 2022, 20:49 IST

    • Akhtar Praises Kohli: ఆఫ్గానిస్థాన్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంపై పాక్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీని మ్యాన్ ఆఫ్ స్టీల్ అని, అనుష్క శర్మను ఐరన్ లేడీగా అభివర్ణించాడు.
కోహ్లీ- అనుష్క శర్మపై అక్తర్ స్పందన
కోహ్లీ- అనుష్క శర్మపై అక్తర్ స్పందన (HT)

కోహ్లీ- అనుష్క శర్మపై అక్తర్ స్పందన

Shoaib Akhtar Praises Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దాదాపు మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో శతకం నమోదు చేసిన సంగతి తెలిసిందే. గురువారం నాడు ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లో 122 పరుగులతో అద్భుత శతకాన్ని సాధించిన కోహ్లీ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఈ సెంచరీని తన భార్య అనుష్క, కుమార్తే వామికాకు అంకితం ఇస్తున్నట్లు స్పష్టం చేశాడు. కోహ్లీ చాలా రోజుల తర్వాత సెంచరీ చేయడంపై క్రీడా సమాజాం నుంచి అతడికి ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను అభినందించాడు. కోహ్లీ మ్యాన్ ఆఫ్ స్టీల్, అనుష్క్ శర్మను ఐరన్ లేడీ అని అభివర్ణించాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"విరాట్ కోహ్లీ నీకు కంగ్రాట్స్. నువ్వు గొప్ప పోరాట యోధుడివి. వ్యక్తిగతంగా ఎంతో మంచివాడివి. ఇలాగే నీ ప్రయాణంలో ముందుకు సాగిపో. నీకు ఎల్లప్పుడు మద్దతు ఉంటుంది. క్రికెట్ చరిత్రలో తప్పకుండా గుర్తుండిపోతావ్. గడ్డు పరిస్థితుల్లో ఆమె తోడుందని, నీ భార్య అనుష్క గురించి చెప్పడం చాలా బాగా అనిపించింది. అనుష్క నీకు హ్యాట్సాఫ్. మీరు ఐరన్ లేడి.. అలానే విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ స్టీల్" అని షోయబ్ అక్తర్ స్పష్టం చేశాడు.

దుబాయ్ వేదికగా ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. 1020 రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో శతకం నమోదు చేసిన కోహ్లీ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 213 పరుగుల లక్ష్య ఛేదనంలో ఆఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా భారత్ 101 పరుగుల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది.

అయితే ఇప్పటికే ఆసియా కప్ ఫైనల్ చేరడంలో టీమిండియా ప్రయాణం ముగిసింది. సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్, శ్రీలంక చేతిలో పరజాయం పాలై.. తన ప్రయాణాన్ని ముగిసింది. అయితే ఆసియా కప్‌లో తన చివరి మ్యాచ్‌ను ఆఫ్గానిస్థాన్‌తో ఆడి విజయంతో మ్యాచ్‌ను ముగించింది.