తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sachin Tendulkar As Captain: మళ్లీ ఇండియన్‌ టీమ్‌ కెప్టెన్‌గా సచిన్‌ టెండూల్కర్‌

Sachin Tendulkar as captain: మళ్లీ ఇండియన్‌ టీమ్‌ కెప్టెన్‌గా సచిన్‌ టెండూల్కర్‌

Hari Prasad S HT Telugu

01 September 2022, 15:24 IST

    • Sachin Tendulkar as captain: మళ్లీ ఇండియన్‌ టీమ్‌ కెప్టెన్‌గా సచిన్‌ టెండూల్కర్‌ వస్తున్నాడు. రానున్న రోడ్ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌ టీమ్‌ కెప్టెన్‌గా మాస్టర్‌ వ్యవహరించనున్నాడు.
ఇండియా లెజెండ్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్
ఇండియా లెజెండ్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ (RSWS/Twitter)

ఇండియా లెజెండ్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్

Sachin Tendulkar as captain: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ మరోసారి ఇండియా లెజెండ్స్‌ కెప్టెన్‌గా వస్తున్నాడు. రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతోంది ఇండియా లెజెండ్స్‌. ఈ సిరీస్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌ 10 నుంచి అక్టోబర్‌ 1 వరకూ జరగనుంది. ఇండియాలోని కాన్పూర్‌, రాయ్‌పూర్‌, ఇండోర్‌, డెహ్రాడూన్‌ నగరాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

కాన్పూర్‌లో తొలి మ్యాచ్‌ జరగనుండగా.. రాయ్‌పూర్‌లో రెండు సెమఫైనల్స్‌, ఫైనల్‌ జరుగుతాయి. రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ తొలి సీజన్‌లో సచిన్‌ కెప్టెన్సీలోని ఇండియా లెజెండ్స్‌ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌ను ఓడించి విజేతగా నిలిచింది. కొవిడ్‌ కారణంగా 2020లో మొదలైన ఈ సీజన్‌ 2021లో పూర్తయింది. ఈసారి రోడ్‌ సేఫ్టీ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌తోపాటు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్ లెజెండ్స్‌ టీమ్స్‌ పార్టిసిపేట్‌ చేయనున్నాయి.

రోడ్‌ సేఫ్టీపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ సిరీస్‌ ప్రారంభించారు. 22 రోజుల పాటు ఈ సిరీస్‌ జరగనుంది. కేంద్ర రోడ్డు రవాణా, హైవేలు, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ, యూత్‌ అఫైర్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మంత్రిత్వ శాఖలు ఈ సిరీస్‌ను సపోర్ట్‌ చేస్తున్నాయి. ఇండియాలో క్రికెట్‌, క్రికెటర్లకు చాలా ఫాలోయింగ్‌ ఉంటుంది. అందువల్ల ఆ క్రికెట్‌ ద్వారానే ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ప్రయత్నంచేస్తున్నారు.

ప్రతి ఏటా ఇండియాలో కొన్ని లక్షల మంది రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారు. ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు మన దేశంలో రోడ్డు ప్రమాదం కారణంగా చనిపోతున్నారు. ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయే ప్రతి వంద మందిలో 30 మంది భారతీయులే.

టాపిక్