Rohit Sharma Record: విరాట్‌ కోహ్లి కెప్టెన్సీ రికార్డును బ్రేక్‌ చేసిన రోహిత్-rohit sharma breaks virat kohlis captaincy record ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit Sharma Record: విరాట్‌ కోహ్లి కెప్టెన్సీ రికార్డును బ్రేక్‌ చేసిన రోహిత్

Rohit Sharma Record: విరాట్‌ కోహ్లి కెప్టెన్సీ రికార్డును బ్రేక్‌ చేసిన రోహిత్

Hari Prasad S HT Telugu
Sep 01, 2022 02:22 PM IST

Rohit Sharma Record: విరాట్‌ కోహ్లి కెప్టెన్సీ రికార్డును బ్రేక్‌ చేశాడు రోహిత్‌ శర్మ. ఆసియా కప్‌లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ ఈ రికార్డును అందుకున్నాడు.

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ (BCCI Twitter)

Rohit Sharma Record: ఆసియా కప్‌లో టీమిండియా సూపర్‌ 4 స్టేజ్‌కు చేరుకుంది. బుధవారం (ఆగస్ట్‌ 31) హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 రన్స్‌ తేడాతో గెలిచిన ఇండియన్‌ టీమ్‌.. గ్రూప్‌ ఎ నుంచి సూపర్‌ ఫోర్‌కు చేరిన తొలి టీమ్‌గా నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌తోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి చెందిన కెప్టెన్సీ రికార్డును చెరిపేశాడు.

ప్రస్తుతం రోహిత్‌ శర్మ టీ20ల్లో ఇండియాకు సెకండ్‌ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలిచాడు. ఇప్పటి వరకూ ఇండియన్‌ టీమ్‌కు 37 టీ20ల్లో కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ 31 విజయాలు సాధించాడు. దీంతో ఇన్నాళ్లూ ధోనీ తర్వాత 30 విజయాలతో (50 మ్యాచ్‌లు) రెండోస్థానంలో ఉన్న విరాట్‌ కోహ్లి ఇప్పుడు మూడోస్థానానికి దిగజారాడు. ఇప్పటికీ టాప్‌లో ధోనీ కొనసాగుతున్నాడు.

ఎమ్మెస్‌ ధోనీ 72 టీ20ల్లో ఇండియన్‌ టీమ్‌కు కెప్టెన్‌గా ఉండగా.. అందులో 41 విజయాలు సాధించాడు. రోహిత్‌ ఇంకా ఈ రికార్డుకు పది మ్యాచ్‌ల దూరంలో ఉన్నాడు. అయితే టీ20 వరల్డ్‌కప్‌ జరగనున్న ఏడాది కావడంతో రానున్న రోజుల్లో టీమిండియా చాలా వరకూ ఈ ఫార్మాట్‌లోనే మ్యాచ్‌లు ఆడబోతోంది. దీంతో ధోనీ రికార్డుకు కూడా రోహిత్‌ చేరువయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఆసియా కప్‌ ప్రారంభానికి ముందు రోహిత్‌ 29 విజయాలతో కోహ్లి కంటే కాస్త వెనుక ఉన్నాడు. అయితే పాకిస్థాన్‌, హాంకాంగ్‌లపై సాధించిన విజయాలతో అతడు కోహ్లిని వెనక్కి నెట్టాడు. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్‌ (26 బాల్స్‌లో 68), విరాట్‌ కోహ్లి (44 బాల్స్‌లో 59) చెలరేగిన విషయం తెలిసిందే. గ్రూప్‌ ఎ నుంచి ఇండియా ఇప్పటికే సూపర్‌ ఫోర్‌కు చేరగా.. మరో బెర్త్‌ కోసం పాకిస్థాన్‌, హాంకాంగ్‌ శుక్రవారం (సెప్టెంబర్‌ 2) తలపడనున్నాయి.

గ్రూప్‌ బి నుంచి ఆఫ్ఘనిస్థాన్‌ ఇప్పటికే నెక్ట్స్‌ స్టేజ్‌కు వెళ్లింది. ఆ టీమ్‌ శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై విజయాలు సాధించింది. ఇక గురువారం (సెప్టెంబర్‌ 1) బంగ్లాదేశ్‌, శ్రీలంక మధ్య జరగబోయే మ్యాచ్‌ విజేత సూపర్‌ ఫోర్‌కు చేరుకోనుండగా.. ఓడిన టీమ్‌ ఇంటిదారి పట్టనుంది.