Kohli Equals Rohit Record: రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన విరాట్‌ కోహ్లి-kohli equals rohit sharma record in t20i in the match against hong kong ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kohli Equals Rohit Record: రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన విరాట్‌ కోహ్లి

Kohli Equals Rohit Record: రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన విరాట్‌ కోహ్లి

Hari Prasad S HT Telugu

Kohli Equals Rohit Record: రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు విరాట్ కోహ్లి. ఆసియా కప్‌లో భాగంగా హాంకాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి ఈ రికార్డు సృష్టించాడు.

విరాట్ కోహ్లి (REUTERS)

Kohli Equals Rohit Record: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి చాలా రోజుల తర్వాత ఫామ్‌లోకి వచ్చాడు. ఆరు నెలల తర్వాత ఇంటర్నేషనల్‌ టీ20 మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేశాడు. ఆసియా కప్‌లో భాగంగా హాంకాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి 59 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు. అతడు 44 బాల్స్‌లోనే 3 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 59 రన్స్‌ చేయడం విశేషం.

ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్‌పై హాఫ్‌ సెంచరీ చేసిన తర్వాత మళ్లీ టీ20 ఫార్మాట్‌లో కోహ్లి ఫిఫ్టీ ప్లస్‌ స్కోరు చేయడం ఇదే తొలిసారి. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 35 రన్స్‌ చేసిన కోహ్లి.. అదే ఫామ్‌ను రెండో మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. మెల్లగా ఇన్నింగ్స్‌ మొదలు పెట్టి చివర్లో చెలరేగాడు. బౌండరీలు ఎక్కువగా లేకపోయినా.. వికెట్ల మధ్య తనకు అలవాటైన రీతిలో చిరుతలా పరుగెత్తాడు.

టీ20ల్లో విరాట్‌ కోహ్లికి ఇది 31వ హాఫ్‌ సెంచరీ కావడం విశేషం. దీంతో అతడు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రికార్డును సమం చేశాడు. టీ20ల్లో 31 ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్ల రికార్డు అది. రోహిత్ తన కెరీర్‌లో ఇప్పటి వరకూ 27 హాఫ్ సెంచరీలు, నాలుగు సెంచరీలు చేశాడు. కోహ్లి ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయినా.. 31 హాఫ్‌ సెంచరీలతో ఇప్పుడు రోహిత్‌ రికార్డును సమం చేశాడు.

నిజానికి హాంకాంగ్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజులో అడుగుపెట్టే వరకూ అది విరాట్‌ కోహ్లి షోలాగే కనిపించింది. అయితే సూర్య కేవలం 26 బాల్స్‌లోనే 68 రన్స్‌ చేసి కోహ్లిని వెనక్కి నెట్టాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 7 ఓవర్లలోనే 98 రన్స్‌ జోడించడం విశేషం. 13 ఓవర్లలో 2 వికెట్లకు 94 రన్స్‌తో ఉన్న ఇండియా.. 20 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లకు 192 రన్స్‌ చేసింది.

సంబంధిత కథనం