Rohit Sharma: ఆసియా కప్‌లో సచిన్‌, విరాట్‌ కోహ్లి రికార్డులపై కన్నేసిన రోహిత్‌ శర్మ-rohit sharma eyes several records in asia cup 2022
Telugu News  /  Sports  /  Rohit Sharma Eyes Several Records In Asia Cup 2022
రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (Windies Cricket Twitter)

Rohit Sharma: ఆసియా కప్‌లో సచిన్‌, విరాట్‌ కోహ్లి రికార్డులపై కన్నేసిన రోహిత్‌ శర్మ

26 August 2022, 17:41 ISTHari Prasad S
26 August 2022, 17:41 IST

Rohit Sharma: ఆసియా కప్‌లో సచిన్‌, విరాట్‌ కోహ్లి రికార్డులపై కన్నేశాడు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. ఆదివారం (ఆగస్ట్‌ 28) పాకిస్థాన్‌తో ఇండియా తన తొలి మ్యాచ్‌ ఆడనున్న విషయం తెలిసిందే.

Rohit Sharma: ఆసియా కప్‌ 2022లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కొన్ని అరుదైన రికార్డులపై కన్నేశాడు. అందులో సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లిల పేరిట ఉన్న రికార్డులు కూడా ఉన్నాయి. ఈసారి టీ20 ఫార్మాట్‌లో జరగబోతున్న టోర్నీ రోహిత్‌ టీమిండియాను లీడ్‌ చేయనున్న విషయం తెలిసిందే. నిజానికి 2018లో ఇండియా ఆసియా కప్‌ గెలిచినప్పుడు కూడా రోహిత్ స్టాండిన్‌ కెప్టెన్‌గా ఉన్నాడు.

ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో పూర్తిస్థాయి కెప్టెన్‌గా రోహిత్‌కు ఈ ఆసియా కప్‌ విజయం అత్యవసరం. ఇది అతని కాన్ఫిడెన్స్‌ను బూస్ట్‌ చేస్తుంది. కెప్టెన్‌గా ఈ ఏడాది టీమిండియాకు వరుస విజయాలు సాధించిపెట్టినా.. బ్యాటర్‌గా మాత్రం విఫలమవుతున్నాడు. 2022లో అతడు 13 టీ20ల్లో కేవలం 290 రన్స్‌ మాత్రమే చేశాడు. కేవలం ఒక్క హాఫ్‌ సెంచరీ మాత్రమే అందులో ఉంది.

అయితే ఆసియా కప్‌లో మాత్రం రోహిత్‌ కొన్ని రికార్డులు క్రియేట్‌ చేసే అవకాశం ఉంది. టీ20 కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి సాధించిన 30 విజయాల రికార్డును అధిగమించడానికి రోహిత్‌ రెండు విజయాల దూరంలో ఉన్నాడు. గతంలో స్టాండిన్‌ కెప్టెన్‌గా, ఇప్పుడు పూర్తిస్థాయి కెప్టెన్‌గా రోహిత్‌ 29 విజయాలు సాధించాడు. అయితే ప్రస్తుతం ధోనీయే 41 టీ20 విజయాలతో టాప్‌లో కొనసాగుతున్నాడు.

ధోనీ 72 మ్యాచ్‌లలో 41 గెలవగా.. రెండోస్థానంలో ఉన్న విరాట్‌ కోహ్లి 50 టీ20ల్లో 30 విజయాలు అందించాడు. ఇక రోహిత్‌ శర్మ రికార్డు మాత్రం అదిరిపోయేలా ఉంది. అతడు కేవలం 35 టీ20ల్లో ఏకంగా 29 విజయాలు సాధించిపెట్టాడు. ఈ విజయాల రికార్డు అలా ఉంచితే.. ఆసియా కప్‌లో మరో బ్యాటింగ్‌ రికార్డు రోహిత్‌ను ఊరిస్తోంది.

ఆసియా కప్‌ హిస్టరీలో 1000 రన్స్‌ మార్క్‌ అందుకున్న తొలి ఇండియన్‌గా నిలవడానికి రోహిత్ 117 రన్స్‌ దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకూ ఈ టోర్నీలో 971 రన్స్‌తో సచిన్‌ టాప్‌లో ఉన్నాడు. అతడు 23 మ్యాచ్‌లలో 971 రన్స్‌ చేయగా.. రోహిత్‌ ఇప్పటి వరకూ 27 మ్యాచ్‌లలో 883 రన్స్‌ చేశాడు. అటు ఆసియా కప్‌లోనే పాకిస్థాన్‌ బ్యాటర్‌ షాహిద్‌ అఫ్రిది పేరిట ఉన్న అత్యధిక సిక్స్‌ల రికార్డును చెరిపేయడానికి కూడా రోహిత్‌ 6 సిక్స్‌ల దూరంలో ఉన్నాడు. అఫ్రిది 26 సిక్స్‌లతో టాప్‌లో ఉన్నాడు.

సంబంధిత కథనం