VVS Laxman Interim Coach: టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
VVS Laxman Interim Coach: ఆసియాకప్ కోసం దుబాయ్ వెళ్లిన టీమిండియాతో చేరాడు ఎన్సీయే డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్. దీంతో ఈ టోర్నీకి ద్రవిడ్ స్థానంలో హెడ్ కోచ్‌గా లక్ష్మణే ఉండనున్నాడు.
VVS Laxman Interim Coach: ఆసియా కప్ కోసం ఇండియన్ టీమ్ హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ ఉండనున్నాడు. అతడు ఇప్పటికే దుబాయ్‌లో ఉన్న రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్‌తో చేరాడు. టీమిండియాతో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడటంతో అతడు టీమ్‌తో కలిసి దుబాయ్ వెళ్లలేకపోయాడు. అతడు టోర్నీ ప్రారంభమయ్యే సమయానికి కోలుకునే అవకాశం లేకపోవడంతో లక్ష్మణ్‌కు ఆ బాధ్యతలు అప్పగించినట్లు బీసీసీఐ వెల్లడించింది.
ఈ మధ్యే ముగిసిన జింబాబ్వే సిరీస్‌కు ద్రవిడ్‌కు విశ్రాంతి ఇవ్వడంతో లక్ష్మణే కోచ్ బాధ్యతలు చేపట్టాడు. సిరీస్ ముగిసిన తర్వాత హరారె నుంచి కోచ్ లక్ష్మణ్, ఆసియాకప్‌లో ఉన్న టీమ్ సభ్యులు దుబాయ్‌లోనే ఉండిపోగా.. మిగతా వాళ్లు ఇండియాకు వచ్చేశారు. లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగించడంపై బీసీసీఐ నుంచి బుధవారం సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడింది.
"ఎన్సీఏ హెడ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఉంటాడు. రానున్న ఆసియా కప్ కోసం అతడు బాధ్యతలు తీసుకుంటాడు" అని బీసీసీఐ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 11 వరకూ ఆసియాకప్ జరగనుంది. ద్రవిడ్ ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడని, అతనికి స్వల్ప లక్షణాలు ఉన్నా నెగటివ్‌గా తేలిన తర్వాతే టీమ్‌తో చేరతాడని మంగళవారం ఒక ప్రకటనలో బోర్డు తెలిపింది. అప్పటి వరకూ లక్ష్మణ్ టీమ్ కోచింగ్ బాధ్యతలు చూసుకోనున్నాడు. ఇక బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లు విక్రమ్ రాథోడ్, పరాస్ మాంబ్రేలు టీమ్‌తోనే ఉన్నారు.
సంబంధిత కథనం